2.0 సెట్‌లో రజనీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రోబో చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న చిత్రానికి 2.0 అన్న పేరును దర్శకుడు శంకర్ ఖరారు చేసిన మాట తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా చెన్నైలో సాగుతోంది. ప్రస్తుతం రజనీకాంత్ ఈ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఆ షూటింగ్‌కు సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. దర్శకుడు శంకర్ రజనీకాంత్‌కు ఏదో సన్నివేశాన్ని వివరిస్తున్నట్లుగా వుంటే, రజనీ దాన్ని ఆసక్తిగా వింటున్నట్లుగా ఈ ఫొటోలో కన్పిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను నవంబర్‌లో విడుదల చేయనున్నారట. అమీజాక్సన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో విలన్‌గా అక్షయ్‌కుమార్ నటిస్తుండగా, ఎ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తుండడం మరో విశేషం. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల కానుంది.