ద్విభాషల్లో ఏక్త

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాబిన్‌సోహి, నవనీత్ కౌర్ థిల్లాన్ జంటగా సుమన్‌రెడ్డి దర్శకత్వంలో బి.ఎస్.ప్రొడక్షన్స్ హౌస్ పతాకంపై రూపొందిస్తున్న చిత్రం ‘ఏక్త’. నిర్మాతలు భిక్షమయ్య సంగం, సుమన్‌రెడ్డి ఈ చిత్రానికి సంబంధించిన తొలి షెడ్యూల్ పూర్తిచేశారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ- తెలుగు హిందీ భాషల్లో ద్విభాషా చిత్రంగా రూపొందిస్తున్న ఏక్త రొమాంటిక్ థ్రిల్లర్‌గా వుంటుందని, తొలి షెడ్యూల్ కేరళ, అలెప్పీలో చిత్రీకరించామని, ఈనెల ద్వితీయార్థంనుండి రెండో షెడ్యూల్ ప్రారంభించి షూటింగ్ పూర్తిచేస్తామని తెలిపారు. మిస్ ఇండియా 2013గా ఎన్నికైన నవనీత్‌కౌర్ థిల్లాన్ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తోందని వారు తెలిపారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి డిసెంబర్‌లో విడుదల చేస్తామన్నారు. నసీర్‌ఖాన్, సలీల్ అంకోలా, ప్రణతిరాయ్, ప్రకాష్, బాహుబలి ప్రభాకర్, రుషద్ రానా, ఔనీత్‌కౌర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా:తమశ్యామ్, సంగీతం:దబ్బుమల్లిక్, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:సుమన్‌రెడ్డి.