S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/20/2016 - 20:55

ఇటీవల విడుదలైన ‘చుట్టాలబ్బాయి’ చిత్రంలో కథానాయికగా నటించిన నమితా ప్రమోద్, తొలిచిత్రంతోనే మంచి నటిగా ముద్రపడింది. 2011 నుండి కెరీర్ స్టార్ట్ చేసిన నమిత, మలయాళ, తమిళ రంగాలలో తన స్టామినా నిరూపించే పాత్రలను చేసింది. సెవెంత్ స్టాండర్డ్ నుండే సీరియల్స్‌లో నటిస్తున్న ఈ కేరళ కుట్టి, మోహినీఆట్టం నృత్యంలో దిట్ట. కథానాయిక శరణ్యామోహన్ డాన్స్ స్కూల్లో నృత్యాన్ని అభ్యసించింది.

08/20/2016 - 20:53

ప్రపంచ ఫొటోగ్రఫి దినోత్సవం సందర్భంగా తెలుగు సినీ స్టిల్‌ఫొటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దాసరి నారాయణరావు విచ్చేసి అసోసియేషన్ సభ్యులను అభినందించారు.

08/20/2016 - 20:51

చక్రం క్రియేషన్స్ పతాకంపై సురేష్.కె.వి దర్శకత్వంలో రూపొందిన ‘అవసరానికో అబద్ధం’ చిత్రం ఈనెల 26న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా నిర్మాతలు విజయ్, సందీప్ మాట్లాడుతూ- సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం యు/ఎ సర్ట్ఫికెట్ పొందిందని, ప్రతి మనిషి జీవితంలో ఎక్కడోఅక్కడ అబద్ధం ఆడి వుంటాడు కనుక అదే పేరును ఈ చిత్రానికి టైటిల్‌గా పెట్టామని తెలిపారు.

08/20/2016 - 20:49

ఆర్.పి.పట్నాయక్ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న ‘మనలో ఒకడు’ చిత్రం కోసం కె.జె.ఏసుదాస్ ఓ పాటను ఆలపించారు. యూనిక్రాఫ్ట్స్ మూవీ పతాకంపై జి.సి.జగన్‌మోహన్ రూపొందిస్తున్న ‘మనలో ఒకడు’ చిత్రానికి ఆర్.పి.పట్నాయక్ బాణీకి ఏసుదాస్ గానం అందించడం విశేషమని దర్శకుడు తెలియజేశారు.

08/19/2016 - 21:44

‘బెంగాల్‌టైగర్’ సినిమా తరువాత రవితేజ ఇంతవరకూ ఒక్క చిత్రానికి ఓకె చెప్పలేదు. ఇప్పటికే పలువురు దర్శకులతో చర్చలు జరిపినట్టు తెలిసింది. అయినా కూడా రవితేజ ఒక్క ప్రాజెక్టూ ఫైనల్ చేయకపోవడం ఆసక్తిగా మారింది. తాజా సమాచారం ప్రకారం పవర్ ఫేం బాబితో సినిమా చేయడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడట. దర్శకుడు బాబి ఇటీవల పవన్‌తో ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ చిత్రాన్ని రూపొందించాడు.

08/19/2016 - 21:43

పవన్‌కళ్యాణ్ కథానాయకుడిగా వుంటే ఆ సినిమా గురించి ప్రత్యేకత చెప్పవలసిన అవసరం లేదు. అదో పెద్ద సినిమాగా రూపొందడం ఖాయం. అలాగే, హీరో వెంకటేష్ ఏ చిత్రంలో నటించినా దానికంటూ హంగులు, ప్రత్యేకతలు ఉంటాయి. అలాగే దర్శకుడు త్రివిక్రమ్ నేతృత్వంలో వచ్చే ఏ సినిమా అయినా సరే, ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతుంది అన్నమాట నిజం.

08/19/2016 - 21:41

గ్లామర్ భామ నయనతార ఈమధ్య కోలీవుడ్‌లో మాంఛి జోరు పెంచింది. వరుస అవకాశాలతో వరుస సినిమాలు చేస్తోంది. ఇటీవలే చాలాకాలం తరువాత తెలుగులో బాబు బంగారం చిత్రంలో నటించింది. సినిమా కమిట్‌మెంట్‌కు ముందే ప్రమోషన్‌లో పాల్గొనని కండిషన్లు పెడుతోందట. కోట్లకు కోట్లు పెట్టి తీసిన సినిమాకు సరైన ప్రమోషన్ ఇవ్వక చాలా సినిమాలు కష్టాలు ఎదుర్కొంటున్నాయి.

08/19/2016 - 21:39

అభిషేక్ పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్తంగా లఘు చిత్రాల పోటీలు ని ర్వహించనుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటుచేసి దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ- అభిషేక్ ఏదైనా కొత్తగా చేయాలని అంటుంటాడని, చిత్ర నిర్మాణంలోకి వచ్చిన ఆయన వరుసగా నాలుగు చిత్రాలను రూపొందిస్తున్నారని అన్నారు.

08/19/2016 - 21:37

అఛీవర్స్ సిగ్నేచర్ ఎం.ఎఫ్ క్రియేషన్స్ పతాకంపై విన్ను మద్దిపాటి, అక్షత జంటగా రూపొందిస్తున్న చిత్రం ‘శేఖరంగారి అబ్బాయి’. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ హైదరాబాద్‌లో నటుడు మోహన్‌బాబు విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకురాలు అక్షత మాట్లాడుతూ, సినిమా చాలా రిచ్‌గా ఉంటుందని, సాంకేతిక నిపుణులు, నటులకు మంచి పేరు తెచ్చే విధంగా రూపొందించామని తెలిపారు.

08/19/2016 - 21:35

అమ్మా నాన్న ఫిలింస్ పతాకంపై రాహుల్ రవీంద్రన్, నిత్యాశెట్టి, తరుణిక ప్రధాన తారాగణంగా ఎన్.రాధోడ్ దర్శకత్వంలో ఎం.మణీంద్రన్ రూపొందిస్తున్న చిత్రం ‘రామసక్కనోడు’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ప్రారంభించారు. తొలి సన్నివేశంపై దాసరి నారాయణరావు క్లాప్‌నివ్వగా, వినాయకరావు కెమెరా స్విచ్చాన్ చేశారు. రాజ్‌కందుకూరి తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు.

Pages