S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

10/12/2016 - 21:13

విసుశ్రీ, అక్ష, హమీదా ప్రధాన తారాగణంగా భద్రాద్రి మూవీస్ పతాకంపై జంగాల నాగబాబు దర్శకత్వంలో ఎల్.నాని రూపొందిస్తున్న చిత్రం ‘కత్తిలాంటి కుర్రాడు’. ఈ చిత్రానికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. హీరో హీరోయిన్లపై హీరో శ్రీకాంత్ క్లాప్‌నివ్వగా, ఎల్.నాని కెమెరా స్విచ్చాన్ చేశారు. ఇ.సత్తిబాబు తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు.

10/12/2016 - 21:12

బాలీవుడ్ సుందరాంగి సోనమ్‌కపూర్ ఇప్పటివరకూ చేసిన సినిమాలన్నీ ఆమెకు ఎటువంటి ఉపయోగాన్ని ఇవ్వలేకపోయాయి. ఆమెతో నటించిన వారందరికీ సినిమాల్లో పేరు వచ్చినా, ఆమె మాత్రం కేవలం గ్లామర్‌ను నమ్ముకునే ఇన్నాళ్లు కెరీర్‌ను నెట్టుకుంటూ వచ్చింది. గత సంవత్సరం విడుదలైన ‘నీర్జా’ సినిమాలో మాత్రమే ఆమె నటించగలదు అని ఓ నమ్మకం ఏర్పడింది బాలీవుడ్ సినీ విమర్శకులకు.

10/12/2016 - 21:11

ఇండియన్ మాజీ సూపర్ ఫాస్ట్‌బౌలర్ శ్రీశాంత్ కథానాయకుడిగా సైలెంట్ అండ్ రెడ్ కార్పెట్ ప్రొడక్షన్స్ పతాకంపై సురేష్ గోవింద్ దర్శకత్వంలో రాజ్ జకారియాస్ రూపొందిస్తున్న చిత్రం ‘టీమ్ 5’. ఈ చిత్రానికి సంబంధించిన పాటల చిత్రీకరణ ఆస్ట్రేలియాలో పూర్తిచేశారు.

10/12/2016 - 21:11

నవీన్ సంజయ్, తనిష్క్‌తివారి జంటగా బొమ్మకు క్రియేషన్స్ పతాకంపై ప్రేమ్‌రాజ్ దర్శకత్వంలో బొమ్మకు మురళి రూపొందించిన చిత్రం ‘శరణం గచ్ఛామి’. ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ- నేటి సమాజంలో రిజర్వేషన్లపై జరుగుతున్న చర్చ నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించామని, అనుకున్నదానికంటే బాగా వచ్చిందని తెలిపారు.

10/12/2016 - 21:07

నందమూరి తారకరామారావు ఆర్ట్స్ పతాకంపై కల్యాణ్‌రామ్ కథానాయకుడిగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందిన ‘ఇజం’ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల 21న విడుదలకు సిద్ధమైంది.

10/12/2016 - 21:06

శ్రీ సాయిరామ్ క్రియేషన్స్ పతాకంపై నాలుగో చిత్రంగా విజయదశమి సందర్భంగా పవన్‌కళ్యాణ్ కథానాయకుడిగా ఆర్.టి.నేసన్ దర్శకత్వంలో ఓ చిత్రం హైదరాబాద్ ఫిలింనగర్‌లో ప్రారంభమైంది. ఎ.ఎం.రత్నం సమర్పణలో రూపొందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తారు. పవన్‌కళ్యాణ్, శరత్‌మరార్, జ్యోతికృష్ణ, దయాకర్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

10/12/2016 - 21:05

దర్శకుడు త్రివిక్రమ్ నిర్మాతగా మారాడు. ఆయన నేతృత్వంలో త్రివిక్రమ్ ప్రొడక్షన్స్ పతాకంపై రాజేష్ దర్శకత్వంలో ఓ చిత్రం ప్రారంభమైంది. పవన్, ప్రియస్వీటి జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది.

10/09/2016 - 20:54

రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న ధృవ చిత్రం షూటింగ్ జోరుగా జరుగుతోంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమా తరువాత చరణ్, సుకుమార్ దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కథా చర్చలు, ప్రీప్రొడక్షన్ పనులు కూడా పూర్తయిన ఈ చిత్రం దసరా రోజున పూజా కార్యక్రమాలతో ప్రారంభిస్తారని తెలిసింది.

10/09/2016 - 20:52

వెండితెరపై విజువల్ వండర్స్‌ను క్రియేట్ చేయడంలో ఆయన శైలే వేరు. ‘అమ్మోరు’, ‘అంజి’, ‘దేవి’, ‘అరుంధతి’ వంటి అద్భుత చిత్రాల్ని రూపొందించి, తాజాగా అదే తరహాలో భారీ గ్రాఫిక్స్‌తో తెరకెక్కిస్తున్న చిత్రం ‘నాగాభరణం’. వంద చిత్రాలకుపైగా దర్శకత్వం వహించి తెలుగు పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు కోడి రామకృష్ణ.

10/09/2016 - 20:50

అదిత్, పూజా జవేరి జంటగా ముకుంద్ పాండే దర్శకత్వంలో రాహుల్ మూవీ మేకర్స్ పతాకంపై బి.ఓబుల్ సుబ్బారెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘ఎల్7’. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఈనెల 21న విడుదలకు సిద్ధమైన సందర్భంగా చిత్ర నిర్మాత ఓబుల్ సుబ్బారెడ్డి వివరాలు తెలియజేస్తూ- ‘ఈ చిత్రంలో హీరో అదిత్ పాత్ర హైలెట్‌గా సాగుతుంది. అలాగే హీరోయిన్ పూజా జవేరి నటనకు ఆస్కారమున్న పాత్రలో ఆకట్టుకుంటుంది.

Pages