గుంటూరు టాకీస్-2 మొదలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూర్ టాకీస్ గతంలో విడుదలై సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ రూపొందిస్తున్నారు. ఆర్‌కె స్టూడియోస్ పతాకంపై రాజ్‌కుమార్ ఎం. నిర్మాణ సారధ్యంలో ‘గుంటూర్ టాకీస్-2’ చిత్రాన్ని లాంఛనంగా హైదరాబాద్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజ్‌కుమార్ ఎం. చిత్ర విశేషాలను తెలుపుతూ తమ సంస్థనుండి విడుదలైన గుంటూర్ టాకీస్ ఎంత విజయవంతమైందో అందరికీ తెలిసిందేనని, అందులో భాగంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని, గుంటూర్ టాకీస్‌లో గిరి పాత్ర చేసిన నరేష్ నటనకు మంచి గుర్తింపు వచ్చిన నేపథ్యంలో ఈ సీక్వెల్‌లో కూడా ఆయనే నటిస్తున్నారని తెలిపారు. పూరి జగన్నాథ్ శిష్యుడు కిరణ్ ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే, కథను అందిస్తున్నారని మొదటి చిత్రంతో తాము కుటుంబ ప్రేక్షకులకు దూరమయ్యానని, ఇప్పుడు వారిని ఆకట్టుకునేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని తెలిపారు. సన్నీలియోన్ ఈ చిత్రంలో ఓ డాన్‌గా నటిస్తోందని, ఆమెపై 20 రోజులపాటు షూటింగ్ ఉంటుందని. సన్నీలియోన్ ఐటమ్‌పాట గతంలో చేసినా పూర్తిస్థాయి పాత్రలో నటిస్తున్న చిత్రం ఇదే కావడం విశేషమని అన్నారు. చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల చేయడానికి సిద్ధం చేస్తున్నామని, దసరాకు షూటింగ్ ప్రారంభించి వచ్చే మార్చిలో విడుదల చేస్తామన్నారు. కార్యక్రమంలో నరేష్, వినీత్, కిరణ్, అతిథిసింగ్, హేమంత్ తదితరులు చిత్ర విశేషాలను తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: రామ్‌రెడ్డి, సంగీతం: శ్రీచరణ్, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, దర్శకత్వం: రాజ్‌కుమార్ ఎం.