సిద్ధమవుతున్న నేత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోపీచరణ్, ఐశ్వర్య అడ్డాల జంటగా రామ్‌క్రియేషన్స్ పతాకంపై రెడ్డెం యాదకుమార్ దర్శకత్వంలో పీరికట్ల రాము రూపొందిస్తున్న చిత్రం ‘నేత్ర’ (మై స్వీట్ హార్ట్). ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ విశాఖపట్నం, అరకు, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరిపి, పూర్తిచేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా నిర్మాత పీరికట్ల రాము మాట్లాడుతూ.. మంచి కథాకథనంతో ఈ చిత్రాన్ని దర్శకుడు చక్కగా తెరకెక్కించారని, అక్టోబర్‌లో ఆడియోను విడుదల చేసి, నవంబర్‌లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు జరుపుతున్నామన్నారు. లవ్ హారర్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించిన ఈ చిత్రం తొలి సగం అంతా సిటీ నేపథ్యంలో సాగుతుందని, రెండో సగం గ్రామీణ నేపథ్యంలో ఉంటుందని దర్శకుడు రెడ్డెం యాదకుమార్ అన్నారు. ప్రేక్షకులకు కావలసిన అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న ఈ చిత్రంలో కెమెరా పనితనం హైలెట్‌గా ఉంటుందని, తప్పక విజయవంతవౌతుందన్న నమ్మకం వుందని ఆయన అన్నారు.