ఇజం పాటలొస్తున్నాయ్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందమూరి కల్యాణ్‌రామ్ కథానాయకుడుగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నందమూరి తారకరామారావు ఆర్ట్స్ పతాకంపై రూపొందిస్తున్న పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఇజం’. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సినిమాను అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి, అక్టోబర్ 20న విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌కు, ట్రైలర్‌కు మంచి ఆదరణ లభిస్తోందని, యూ ట్యూబ్‌లో రికార్డు స్థాయిలో వ్యూస్ వచ్చాయని దర్శకుడు పూరి జగన్నాథ్ తెలిపారు. కల్యాణ్‌రామ్ కెరీర్‌లోనే పవర్‌ఫుల్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఓ వైవిధ్యమైన లుక్‌తో ఆయన కనిపిస్తారని ఆయన అన్నారు. అక్టోబర్ 5న ఆడియోను గ్రాండ్‌గా విడుదల చేయనున్నామని, అనూప్ రూబెన్స్ అందించిన సంగీతం ఈ సినిమాకు హైలెట్‌గా ఉంటుందని, వైవిధ్యమైన కథాకథనాలు చిత్రంలో ప్రేక్షకులకు థ్రిల్ కలిగిస్తాయని ఆయన అన్నారు. అదితి ఆర్య కథానాయికగా నటించిన ఈ చిత్రంలో జగపతిబాబు, గొల్లపూడి మారుతిరావు, తనికెళ్ల భరణి, పోసాని కృష్ణమురళి, జయప్రకాష్‌రెడ్డి, అలీ, ఈశ్వరిరావు, వెనె్నల కిషోర్, రఘు, అజయ్‌ఘోష్, శ్రీకాంత్, మాధవ, నయన్, రవి తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి కెమెరా: ముఖేష్, ఎడిటింగ్: జునైద్, పాటలు: భాస్కరభట్ల, సంగీతం: అనూప్ రూబెన్స్, నిర్మాత: నందమూరి కళ్యాణ్‌రామ్, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పూరి జగన్నాథ్.