S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

03/08/2016 - 22:20

* డైరెక్టర్ నందినిరెడ్డి

03/08/2016 - 22:19

ఆ మధ్య వీరిద్దరి మధ్య విబేధాలు వచ్చాయని పుకార్లు షికార్లు చేసినా అదంతా ఒట్టిదేనని తాజా సంఘటన తేల్చేసింది. షారుఖ్ ఖాన్ అంటే తనకెంతో ఇష్టమని, అతడి అభిమానినని ఈ మధ్య అతడి చిత్రం ‘్ఫన్’ ట్రెయిలర్ విడుదల సందర్భంగా సల్మాన్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

03/06/2016 - 22:19

తెలుగులో కంటే తమిళంలోనే బాగా పాపులర్ అయింది. తెలుగు భాను శ్రీవిద్య. ఇక్కడ చేసిన రెండు, మూడు సినిమాలు పెద్దగా వర్కవుట్ కాకపోవడంతో తమిళంలోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ భామ ప్రస్తుతం తమిళంలో మంచి సినమాలే చేతిలో ఉన్నాయి. అయితే ఇటీవలే పెళ్లి గురించి అడగ్గా షాక్ ఇచ్చే జవాబు చెప్పింది?

03/06/2016 - 22:12

బేబి వౌనిక, రమణి, చంద్రమోహన్, గుండు హన్మంతరావు ముఖ్యపాత్రల్లో పి.అమర్‌నాథ్‌రెడ్డి దర్శకత్వంలో మిత్ర ప్రొడక్షన్స్ బి.సుధాకర్ నాయుడు సమర్పణలో బి.మదనగోపాల్‌నాయుడు నిర్మిస్తున్న చిత్రం ‘పేదరికం’. పిల్లల పాలిట శాపమా? అనే ట్యాగ్‌లైన్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలోని పాటలు ఇటీవలే విడుదలయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న దర్శకుడు సముద్ర ఆడియో సీడీని ఆవిష్కరించారు.

03/06/2016 - 22:10

రామచంద్ర, ఆశాలత జంటగా మురళీప్రసాద్ దర్శకత్వంలో అక్షయప్రత్యుష ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రామచంద్ర దోసపాటి నిర్మిస్తున్న చిత్రం ‘అమ్మాయి.. ఆరుగురు’. వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నిర్మాత బెక్కం వేణుగోపాల్ సీడీలను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, తన బ్యానర్‌లో తీసే సినిమాల్లో కొత్త వారిని పరిచయం చేస్తుంటానన్నారు.

03/06/2016 - 22:09

సంచలన దర్శకుడు వర్మ ఎప్పుడూ ఏదో సంచలనంతో వార్తల్లో నిలవడం ఆనవాయితీగా మారింది. ఇటీవలే ‘వంగవీటి’ పేరుతో సినిమా చేస్తానంటూ విజయవాడలో హంగామా చేసిన వర్మ ‘కిల్లింగ్ వీరప్పన్’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. సంచలన వ్యక్తుల బయోగ్రఫీలను తీయడంలో సిద్ధహస్తుడిగా పేరుతెచ్చుకున్న వర్మ ఇప్పుడు మరో సంచలన సినిమాకు తెర లేపాడు.

03/06/2016 - 22:08

* దర్శకుడు అశోక్‌రెడ్డి

03/06/2016 - 22:06

ప్రముఖ నటుడు పవన్‌కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా బిజినెస్ పరంగా కూడా సంచలనం సృష్టిస్తోందని వార్తలొస్తున్నాయి. ‘అత్తారింటికి దారేది’ సినిమా తర్వాత పవన్‌కళ్యాణ్ నటిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా కాజల్ నటిస్తోంది.

03/06/2016 - 22:05

ప్రముఖ నటుడు ఎన్టీఆర్ ఇటీవలే ‘నాన్నకు ప్రేమతో’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఎన్టీఆర్ నటుడిగానే కాక, ఈమధ్య తను నటిస్తున్న సినిమాల్లో పాటలు కూడా పాడుతున్న విషయం తెలిసిందే. అయితే ఈసారి ఆయన తన స్నేహితునికోసం కన్నడంలో ఓ పాట పాడాడు. ప్రముఖ కన్నడ నటుడు పునిత్ రాజ్‌కుమార్ హీరోగా నటిస్తున్న ‘చక్రవ్యూహ్’ సినిమాకోసం ఎన్టీఆర్ పాట పాడాడు.

Pages