S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

10/19/2016 - 21:02

నాగచైతన్య, శ్రుతిహాసన్, అనుపమ పరమేశ్వరన్ ముఖ్యపాత్రల్లో చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందిన ‘ప్రేమమ్’ చిత్రం ఇటీవలే విడుదలై మంచి టాక్ తెచ్చుకున్న సందర్భంగా బుధవారం చిత్ర విజయోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాగార్జున మాట్లాడుతూ ‘ప్రేమమ్’ విజయం సాధించడం ఆనందంగా ఉందని, సినిమా చూసిన వెంటనే హిట్ అవుతుందన్న నమ్మకం కలిగిందని, అది నిజమైందని అన్నారు.

10/18/2016 - 21:12

పవన్ కల్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న ‘కాటమరాయుడు’ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి డాలి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమా తరువాత పవన్ తన నెక్స్ట్ సినిమాలు ఓకే చేస్తూ... మరోవైపు జనసేన కార్యక్రమాలను కూడా జోరుగా చేస్తున్నాడు. ఇక ‘కాటమరాయుడు’ సినిమాను శరత్ మరార్ నిర్మిస్తున్నాడు.

10/18/2016 - 21:11

వరుసగా స్టార్ హీరోల సినిమాలతో ఛాన్సులు కొట్టేస్తూ.. మరోవైపు సూపర్ హిట్స్‌ని అందుకుంటూ దూసుకుపోతున్న గ్లామర్ భామ సమంత జోరు మామూలుగా లేదు. ప్రస్తుతం తెలుగులో బిజీ హీరోయిన్‌గా ఉన్న సమంత అటు తమిళంలో కూడా అదే స్ట్రాటజీని మెయిన్‌టైన్ చేస్తోంది. లేటెస్ట్‌గా విశాల్ సరసన హీరోయిన్‌గా ఛాన్స్‌కొట్టేసింది.

10/18/2016 - 21:09

హనీష్, కన్నడ భామ చిరాశ్రీ జంటగా శ్రీ కనకదుర్గా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై కె.సూర్యనారాయణ దర్శకత్వంలో ఎం.మారుతిప్రసాద్, ఎన్.రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘ఆమె.. అతడైతే’. యశోకృష్ణ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదలైంది. ముఖ్యఅతిథిగా హాజరైన ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు ఆడియో సీడీలను విడుదల చేశారు. అనంతరం సి.కళ్యాణ్ మాట్లాడుతూ.. టైటిల్ బావుందని, మంచి ఫీల్ కనబడుతోందని అన్నారు.

10/18/2016 - 21:07

అక్కినేని నాగార్జున హీరోగా చేయని ప్రయోగంలేదు. కమర్షియల్ సినిమా, మాస్-మసాలా, భక్తి ఇలా అన్నిరకాల సినిమాలు చేసి హీరోగా ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చుకున్నాడు. ఇక కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేయడంలో ఆయనకు ఆయనే సాటి! ఇప్పటివరకు నాగార్జున కాలుపెట్టనిది ఒక్క హారర్ జోనర్‌లోనే. ఇప్పుడు అందులోను సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు.

10/18/2016 - 21:05

మలయాళంలో హీరోయిన్‌గా మంచి మార్కులు కొట్టేసి.. తెలుగులో ఒకే ఒక్క సినిమాతో అందరి దృష్టి తనవైపుకు తిప్పుకుంది అందాల భామ కీర్తి సురేష్. ‘నేను శైలజ’ సినిమా తరువాత ఈ భామకు తెలుగులో అవకాశాలు వస్తున్నా కూడా ఒక్క సినిమాకు ఓకే చెప్పడం లేదు. ఇక కోలీవుడ్‌లో మాత్రం దూసుకుపోతున్న ఈ భామకు ఇప్పుడు లక్కీ ఛాన్స్ దక్కింది.

10/18/2016 - 21:04

నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న రెండవ సినిమా ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రం జోరుగా షూటింగ్ జరుపుకుంటోంది. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక బాలయ్య 101వ చిత్రంగా రైతు చిత్రం వస్తుందని అప్పట్లో తెలిపారు. కానీ ఇప్పుడు 101వ చిత్రంగా ‘విక్రమసింహ’ వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

10/18/2016 - 21:02

రామ్‌శంకర్, నికిషాపటేల్ జంటగా శేషాద్రి క్రియేషన్స్ పతాకంపై వాసుదేవ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అరకురోడ్డులో. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో భాగంగా డిటిఎస్ మిక్సింగ్ జరుపుతున్నారు.

10/18/2016 - 21:01

ప్రభాకర్ (బాహుబలి ఫేమ్) ప్రధాన పాత్రలో రెడ్ కార్పెట్ రీల్స్ పతాకంపై ఎస్.జె.చైతన్య దర్శకత్వంలో రవి పచ్చిపాల రూపొందించిన చిత్రం ‘ఆవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్లి’ (ఇది యదార్థ కథ కాదు). ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా దర్శకుడు చైతన్య మాట్లాడుతూ..

10/18/2016 - 21:00

గోపీచంద్, ఐశ్వర్య అడ్డాల జంటగా రామ్‌క్రియేషన్స్ పతాకంపై రెడ్డెం యాదకుమార్ దర్శకత్వంలో పీరికట్ల రాము రూపొందించిన చిత్రం ‘నేత్ర’ (మై స్వీట్ హార్ట్). ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తిచేసి, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ముగిస్తున్నారు. సినిమాకు సంబంధించిన ఆడియోను నవంబర్ రెండోవారంలో విడుదల చేసి, చివరి వారంలో సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నారు.

Pages