S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

10/18/2016 - 20:59

రంజిత్‌కుమార్, సన జంటగా స్వరూప ఆర్ట్స్ పతాకంపై కుర్ర రాజలింగు రూపొందించిన చిత్రం ‘రెండు ఆత్మల ప్రేమకథ’. సదివె దేవేందర్ సంగీతం అందించిన ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ, హారర్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించిన ఈ చిత్రం అందరికీ నచ్చుతుందని, హీరోగా దర్శకుడిగా రెండు బాధ్యతలు రంజిత్‌కుమార్ చక్కగా నిర్వహించారని తెలిపారు.

10/18/2016 - 20:57

పూనమ్‌పాండే ప్రధాన పాత్రలో వి.బి.ఆర్. క్రియేషన్స్, సూరజ్ ప్రొడక్షన్స్ పతాకంపై భవానీ మస్తాన్ దర్శకత్వంలో ఫకృద్దీన్‌ఖాన్, విజయ్‌భాస్కర్‌రెడ్డి సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రానికి సంబంధించిన తొలి షెడ్యూల్ మంగళవారం పూర్తిచేశారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ..

10/16/2016 - 21:03

మహేష్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం హైదరాబాద్ పరిసరాల్లో షూటింగ్ జరుగుతోంది. ప్రముఖ తమిళ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ ప్రతిష్టాత్మక చిత్రానికి కూడా అంతే భారీ హైప్ నెలకొంది. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్‌పై సినీ వర్గాల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఈ సినిమా టైటిల్స్‌పై రకరకాల రూమర్లు పుట్టుకొస్తున్నాయి.

10/16/2016 - 21:01

‘నాకేటైపోతున్నాదిరో.. ఎంకయ్య మామ నీ ఆటుపోటు ఓపలేను సందామామ..’ అంటూ వినిపించే పాటకు మనస్సులో డాన్సు చేయని ప్రేక్షకుడు ఎవరు? సినిమా అన్నాక మంచి కథ కథనంతోపాటుగా పాటలు, సంగీతం ఎంత ముఖ్యమో ఐటెం పాట కూడా అంత ముఖ్యమై కూర్చుంది ఇప్పుడు. ఒకప్పుడు చిత్రాలలో క్లబ్ డాన్సులని చేర్చేవారు. జ్యోతిలక్ష్మి, విజయలలిత, హలం, జయకుమారి, రీటా లాంటి వాళ్లు అప్పట్లో క్లబ్ డాన్సులకు పెట్టింది పేరు.

10/16/2016 - 20:57

కార్తీ కథానాయకుడుగా పి.వి.పి. సినిమా పతాకంపై గోకుల్ దర్శకత్వంలో పెరల్ వి.పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి, కెవిన్ అనె్న, ఎస్.ఆర్.ప్రకాష్‌బాబు, ఎస్.ఆర్.ప్రభు సంయుక్తంగా రూపొందించిన చిత్రం ‘కాష్మోరా’. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను, ఆడియోను ఇటీవల విడుదల చేశారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి దీపావళి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నారు.

10/16/2016 - 20:55

మెగా తనయుడు రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న ‘్ధృవ’ చిత్రం దాదాపు షూటింగ్ పూర్తికావచ్చింది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ట్రైలర్స్ ఫ్యాన్స్‌లో అమితాసక్తిని ఏర్పరిచాయి.

10/16/2016 - 20:53

‘జనతాగ్యారేజ్’ సినిమా విడుదలయ్యాక జూ.ఎన్టీఆర్ తర్వాతి చిత్రం ఏమిటి? అన్న సందిగ్ధత ఇంకా తొలగనే లేదు. సినిమా అనుకున్న అంచనాలు రీచ్ అవడంతో అవకాశాలు భారీగా వస్తాయని, ఎన్టీఆర్ ఎడాపెడా సినిమాలు ఒప్పేసుకుంటాడని అభిమానులు అనుకున్నారు. కానీ ఎన్టీఆర్ ఆచితూచి అడుగు వేస్తున్నాడు. గతంలో కథారచయిత వక్కంతం వంశీ దర్శకత్వంలో నటించడానికి మాట ఇచ్చాడు ఎన్టీఆర్. మంచి కథ తయారు చేసుకుని రమ్మని కూడా చెప్పాడు.

10/16/2016 - 20:51

గ్లామర్ భామ రెజీనా హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం నక్షత్రం. సందీప్‌కిషన్ హీరోగా ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ
దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన రెజీనా లుక్‌ని ఆదివారం విడుదల చేశారు. అల్ట్రామాడ్రన్ డ్రెస్‌లో ఆకట్టుకుంటున్న రెజీనా ఈ సినిమాలో తనదైన టాలెంట్‌తో సత్తా చాటడానికి సిద్ధమైంది.

10/16/2016 - 20:49

ముంబై కళకళలాడింది. బాలీవుడ్ తారల ఫ్యాషన్ మెరుపులు ఆహూతులను మైమరిపించాయి. అందాల తారలు, అగ్రహీరోలు అదిరేటి డ్రెస్సులు వేసుకుని క్యాట్‌వాక్ చేసి వాహ్ అన్పించారు. బిగ్ బి అమితాబ్ నుంచి సిద్ధార్థ మల్హోత్రావరకు, ఐశ్వర్యారాయ్ నుంచి అలియాభట్ వరకు అధునాతన దుస్తుల్లో మెరిసిపోయారు. ముంబైలో జరిగిన ఫిల్మ్‌ఫేర్ గ్లామర్ అండ్ స్టైల్ కార్యక్రమం కళ్లు చెదిరేలా అదిరిపోయింది.

10/15/2016 - 21:10

‘బొమ్మరిల్లు’ సినిమాతో సంచలన విజయం సాధించి ఎంతో గుర్తింపుతెచ్చుకున్నాడు దర్శకుడు భాస్కర్. ఆయన కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన ఆ సినిమా తన ఇంటిపేరుగా మారిపోయింది. ఆ సినిమా తరువాత పలు చిత్రాలను చేసిన భాస్కర్‌కు ఆ రేంజ్‌లో హిట్ అందించిన సినిమా ఒక్కటీ దక్కలేదు. ఇటీవలే ‘బెంగుళూరు డేస్’ అని ఓ తమిళ చిత్రాన్ని రీమేక్ చేశాడు. అది కూడా నిరాశపర్చడంతో తెలుగులో మళ్లీ ప్రయత్నాలు మొదలుపెట్టాడు.

Pages