S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/16/2016 - 09:13

పవన్‌కల్యాణ్-దాసరిల చిత్రం ప్రకటించి చాలాకాలం జరిగిపోయింది. కానీ ఇప్పటివరకు ఆ ప్రాజెక్టు ముందుకు కదలలేదు. కానీ దీనిపై మీడియాలో రోజుకో వార్త పుట్టుకొస్తోంది. తాజాగా దాసరి తారకప్రభు ఫిలిమ్స్‌పై ‘బోస్’ అనే టైటిల్‌ని రిజిస్టర్ చేయించారని సమాచారం. ఈ టైటిల్ పవన్ కోసమే అంటూ ప్రచారం ఊపందుకుంది. దాసరి నారాయణరావు తన బ్యానర్‌లో సినిమా చేసి చాలా కాలం అయింది.

09/16/2016 - 09:12

బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రపంచంలో అత్యధిక ఆదాయం పొందుతున్న బుల్లితెర నటుల్లో ప్రియాంకకు ఎనిమిదో స్థానం లభించింది. ప్రఖ్యాత మ్యాగజైన్ ఫోర్బ్స్ పదిహేనుమంది నటీమణుల పేర్లతో ఈ జాబితాను విడుదల చేసింది. అత్యధిక పారితోషికం (ఆదాయం) పొందుతున్న సినీతారల జాబితాలో బాలీవుడ్ నటి దీపికకు పదో స్థానం లభించిన విషయం తెలిసిందే.

09/16/2016 - 09:11

ఈమధ్యే హీరో నాని ‘ఇండస్ట్రీకి హీరోయిన్లను సప్లయ్ చేస్తున్నా’ అని ‘మజ్ను’ ఆడియో వేడుకలో కామెంట్ చేసిన విషయం తెలిసిందే. నాని వరుసగా చేస్తున్న సినిమాల్లో కొత్త హీరోయిన్స్‌ని పరిచయం చేస్తున్నాడు. ఇక ఆ హీరోయిన్స్‌కు టాలీవుడ్‌లో మంచి క్రేజ్ దక్కుతోంది. ‘మజ్ను’ సినిమాలో కూడా నాని ఇద్దరు హీరోయిన్స్‌ని పరిచయం చేయడం విశేషం. ఇక అసలు విషయం ఏమిటంటే..

09/16/2016 - 09:11

అక్కినేని నాగచైతన్య తరువాతి సినిమా ‘సోగ్గాడే చిన్నినాయనా’ ఫేమ్ కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ నెలలో ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. ఇందులో నాగచైతన్య సరసన రకుల్‌ప్రీత్‌సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే ఈమెతోపాటు మరో హీరోయిన్‌తో కూడా చైతు రొమాన్స్ చేయనున్నారని తెలుస్తోంది. ఆమె ఎవరో కాదు వరుస హిట్లతో యంగ్ హీరోలకి లక్కీ హిరోయిన్‌గా మారిన లావణ్య త్రిపాఠి.

09/16/2016 - 09:10

మెగా కుటుంబం నుంచి హీరో సాయిధరమ్ తేజ్ ఈ ఏడాది ఇప్పటికే ‘సుప్రీం, ‘తిక్క’ వంటి చిత్రాలతో బాక్సాఫీసును పలకరించాడు. ఇప్పుడు మరింత జోరు పెంచాడు. తేజ్ త్వరలో మరో రెండు సినిమాల షూటింగ్ మొదలుపెట్టనున్నాడు. ఇందులో ఒకటి కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘నక్షత్రం’ కాగా, మరొకటి గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తున్న కొత్త చిత్రం. తేజ్ ఈనెల 19 నుండి నక్షత్రం షూటింగ్‌లో పాల్గొంటాడు.

09/16/2016 - 09:10

‘నిర్మలా కానె్వంట్ చిత్రం షూటింగ్ జరిగేటప్పుడు నేను రెండుసార్లు మాత్రమే వెళ్లాను. రోషన్ ఎక్కడా టెన్షన్ లేకుండా కూల్‌గా చేస్తున్నాడు. ఇక ఆ తరువాత షూటింగ్‌కు వెళ్లలేదు. ఏది చేసినా నువ్వే పూర్తి స్వేచ్చతో నిర్ణయం తీసుకోమని చెప్పాం’ అని నటుడు శ్రీకాంత్ తెలిపారు.

09/14/2016 - 21:56

‘అవకాశాలు లేవని బాధపడడం వృధా. ఇక్కడ పనికి ఏమాత్రం కరువులేదు. అయితే, ఆ పనికి మనం సరిపోతామా లేదా అన్న నమ్మకం కలిగిస్తే చాలు, అవకాశాలు వాటికవే వస్తాయి’ అంటోంది తాప్సీ. దక్షిణాదిలో అనేక చిత్రాల్లో నటించినా గుర్తింపు రాకపోవడంతో బాలీవుడ్‌కి వెళ్లింది. అక్కడ కొద్దో గొప్పో అవకాశాలు వస్తున్నాయి, మంచి నటిగా నిరూపించుకుంటోంది. తాజాగా ఆమె నటించిన ‘పింక్’ చిత్రం గురించి బాలీవుడ్‌లో చర్చ జరుగుతోంది.

09/14/2016 - 21:54

కథానాయికగా కానె్సప్ట్ ఓరియంటెడ్ కమర్షియల్ చిత్రాల్లో నటిస్తూనే మరోవైపు హీరోయిన్ ప్రాధాన్యత ఉన్న చిత్రాల్లో నటించడానికి నయనతార ముందడుగు వేస్తోంది. ఆమె కథానాయికగా తెలుగు, తమిళ భాషల్లో ఓ హారర్ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రానికి ‘డోర’ అనే పేరును ఖరారు చేశారు. దాసు రామస్వామి దర్శకత్వంలో మల్కాపురం శివకుమార్ తెలుగులో దీన్ని అందిస్తున్నారు.

09/14/2016 - 21:52

‘బాహుబలి’ తొలి చిత్రం విడుదలైనప్పటినుండీ రెండవ చిత్రం కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి పరిచయం చేసిన బాహుబలి రెండో సినిమాను ప్రారంభించి దాదాపు మూడేళ్లు దాటింది. హీరోగా నటిస్తున్న ప్రభాస్, రాణాలు ఇద్దరూ ఈ చిత్రంతోనే మమేకమై సాగుతున్నారు. ఇన్నాళ్లకు రాణాకు బాహుబలి చిత్రంలో బాహుబలి చిత్రానికి సంబంధించిన పేకప్ చెప్పారు.

09/14/2016 - 21:51

విశాల్ కథానాయకుడిగా తమన్నా హీరోయినగా సురాజ్ దర్శకత్వంలో నిర్మాత జి.హరి అందిస్తున్న చిత్రం ‘ఒక్కడొచ్చాడు’. హరి వెంకటేశ్వర పిక్చర్స్ పతాకంపై అందిస్తున్న ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ, విశాల్ కెరీర్‌లో భారీ బడ్జెట్ చిత్రంగా యాక్షన్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా మంచి మ్యూజిక్‌తో కమర్షియల్ ఎలిమెంట్స్‌తో రూపొందిన ఈ చిత్రం అందరికీ నచ్చుతుందని తెలిపారు.

Pages