నటనతో మెప్పించడమే నా పని -శ్రుతిహసన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రేక్షకులు ఎప్పటికప్పుడు కొత్తదనం కోరుకుంటున్నారు. వాళ్ళకు నచ్చినట్లుగా అభినయించడమే నా పని. ఎంచుకున్న కథలో కొత్తదనం వుంటేనే అంగీకరిస్తా. ప్రేక్షకులు సినిమా కామెడీ జోనరా? కమర్షియల్ ఎంటర్‌టైనరా? ఇంకేదైనా వుందా? అని ఆలోచించరు. అందుకే కథ నచ్చితేనే సినిమా ఒప్పుకుంటాను..’- అని నటి శ్రుతిహసన్ తెలిపారు. నాగచైతన్య, శ్రుతిహసన్, అనుపమా పరమేశ్వరన్, మడొన్నా సెబాస్టియన్ ప్రధాన తారాగణంగా రూపొందించిన ‘ప్రేమమ్’ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో తన పాత్రకు మంచి ఆదరణ లభిస్తోందని పలు విశేషాలను శ్రుతిహసన్ తెలిపారు.
సితారగా
ప్రేమమ్ లాంటి మంచి ప్రేమకథా చిత్రంలో నటించడం సంతోషంగా వుంది. ముఖ్యంగా సితారగా నా నటనకు వంద మార్కులు వేస్తున్నారు ప్రేక్షకులు. ఈ పాత్ర అందరికీ నచ్చడం మరింత ఆనందాన్నిస్తోంది.
అన్ని ఎమోషన్లతో
ప్రేమకథలు, హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలు చేయాలన్న కోరిక వుంది. కథలో అన్ని ఎలిమెంట్స్ వుండాలని కోరుకుంటాను. అవి కూడా పూర్తి స్థాయిలో తెరపై పండితేనే కథకు న్యాయం జరుగుతుంది. ఓ మంచి కథలో కామెడీ, ట్రాజెడీ, ఫైట్స్‌లాంటి ఎమోషన్లు వుంటేనే అది హిట్ అవుతుంది.
ఛాలెంజింగ్‌గా
కమల్‌హసన్ నా తండ్రి అని చెప్పుకోవడం గర్వంగా ఫీలవుతాను. ఆయన ఆల్ రౌండర్. యాక్టర్, డైరెక్టర్, రైటర్‌గా ఎన్నో ప్రయోగాలు చేశారు. అదే నాకు ప్రేరణ. ఆయన చూపిన దారిలోనే ఏదైనా సరే ఛాలెంజింగ్‌గా చేయడానికి సిద్ధమవుతా.
నా శైలి చూపడానికే
ఏ చిత్రమైనా రీమేక్ చేసేటప్పుడు దానికి సంబంధించిన హోమ్‌వర్క్ పూర్తిగా ఫాలో అవుతా. ఒరిజినల్‌లో చేసిన నటీనటుల నటనను గుర్తుపెట్టుకుని నా శైలిలో నటించడానికి ప్రయత్నిస్తా. తెలుగు ప్రేమమ్ మాతృకతో ఏ సంబంధం లేకుండా కొత్తగానే వుంటుంది. ప్రతి పాత్రలోనూ వైవిధ్యాలు ఉంటాయి. అదే సినిమాకు ప్లస్ అయింది.
కాటమరాయుడుతో
పవన్‌కళ్యాణ్‌తో కాటమరాయుడు చిత్రంలో నటిస్తున్నా. ఇందులో నా పాత్ర గురించి చెబితే బాగోదు. సింపుల్‌గా, నైస్‌గా వుండే అమ్మాయిగా మాత్రం కనిపిస్తా. పవన్‌తోనే నాకు స్టార్ ఇమేజి వచ్చింది. మళ్లీ తనతో చేయడం గౌరవంగా భావిస్తున్నా.
గాయకురాలిగా
ప్రస్తుతం నటనతోపాటుగా పాటలు కూడా పాడదామనుకుంటున్నాను. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో బిజీగా వున్నా, పాటలు పాడే ప్రయత్నం చేస్తున్నా. భవిష్యత్తులో రచనపైన కూడా దృష్టి పెట్టే ఆలోచన వుంది. సామాజిక బాధ్యతగా మహిళల హక్కుల గురించి ఏదైనా చెయ్యాలని ఉంది.
ఒకేసారి మూడు
ఒకేసారి మూడు భాషల్లో నటించడం కొద్దిగా కష్టమే. అన్ని భాషల డైలాగులను నేర్చుకుంటుంటే, చిన్నప్పటి ఫిజిక్స్ పాఠాలు గుర్తుకొస్తాయి. అమ్మో..! చాలా కష్టమైన పనే అనిపిస్తుంది.
సూర్యతో
సెవెంత్ సెన్స్ చిత్రం తరువాత సూర్యతో మరో చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నాను. తెలుగులో కూడా కొన్ని చిత్రాలకు చర్చలు జరుగుతున్నాయి. ఆ వివరాలు త్వరలోనే చెబుతా.

-యు