మమ్మల్ని కొత్తగా చూస్తారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇప్పటివరకూ మనం ఎన్నో రకాల ‘ఇజా’ల గురించి విన్నాం. కానీ ఈ సినిమాలో చూపించేది మాత్రం ఓ కొత్త ఇజం అని అంటున్నాడు హీరో నందమూరి కళ్యాణ్‌రామ్. ఆయన హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నందమూరి తారకరామారావు ఆర్ట్స్ పతాకంపై తెరకెక్కిన ‘ఇజం’ చిత్రం ఈనెల 21న విడుదలవుతున్న సందర్భంగా కల్యాణ్‌రామ్‌తో ఇంటర్వ్యూ...
* ఏ ఇజం గురించి చెబుతున్నారు?
- ఇప్పటివరకూ చాలారకాల ఇజాలు.. కమ్యూనిజం, కాపిటలిజం, హ్యూమనిజం, ఫ్యాక్షనిజం ఇలా చాలా విన్నాం. ఫిలాసఫీతో ఐడియాలజీని కలిపి సొసైటీకోసం చేసే ప్రయత్నమే ఈ ఇజం.
* ఇంతకూ మీరు ఏ ఇజం? కల్యాణిజం అనుకోవచ్చ?
- నేను పక్కా హ్యూమనిజం. ఇందులో కల్యాణిజం అనేది ఉండదు.
* సినిమాలో ఏ విషయం గురించి చర్చించబోతున్నారు, అందులో మీ పాత్ర?
- ఇందులో సోషల్ మెసేజ్ వుంటుంది. అలాగని మీరు అందరూ అది చేయండి, ఇది చేయండి అని నీతులు చెప్పను. ఇందులో నేను జర్నలిస్టు పాత్రలో కనిపిస్తాను. ఒకరకంగా చెప్పాలంటే ఇనె్వస్టిగేటివ్ జర్నలిస్ట్ పాత్ర. ఈ సినిమాలో చర్చించిన అంశాల్ని చూస్తే మీరు నిజంగా ఇలా జరిగితే బాగుండును అని అనుకుంటారు. ఖచ్చితంగా ఇలా జరిగితే మాత్రం సొసైటీలో చాలా మార్పులొస్తాయి.
* ఇందులో వికిలీక్స్ గురించి చర్చించారని తెలిసింది?
- నిజానికి ఈ సినిమా ఎప్పుడో మొదలుపెట్టాం. ఇక వికిలీక్స్ ఈమధ్యే బయటికొచ్చాయి. ఈ సినిమాలో దానిగురించి చర్చించామని కాదుగానీ, చాలా విషయాలు ఉంటాయి.
* పూరితో పనిచేయడం ఎలా వుంది?
- నేను ఇప్పటివరకూ పనిచేసిన దర్శకులతో పోలిస్తే పూరితో బెస్ట్ అనుభూతి అని చెప్పాలి. ఆయన ప్రతీరోజూ షూటింగ్‌లో నవ్వుతూనే వుంటాడు. ముఖ్యంగా ఆయన మనకిచ్చే స్ఫూర్తి అద్భుతం. తనతో పనిచేసినవాళ్ళెవరైనా ఆయనతో ఫ్రెండ్స్‌గా మారిపోతారు.
* సాధారణంగా పూరి జగన్నాథ్ సినిమాల్లో హీరో పాత్ర, డైలాగ్‌లు కొత్తగా వుంటాయి కదా! మరి ఇందులో?
- ఇప్పటివరకూ పూరి జగన్నాథ్ చేసిన సినిమాలు వేరు, ఈ సినిమా వేరు. అలాగే ఇజం సినిమాకు ముందు కల్యాణ్‌రామ్ వేరు, ఇకముందు కల్యాణ్‌రామ్ వేరు. ఈ సినిమాతో మా ఇద్దరినీ కొత్తగా చూస్తారు.
* పూరి జగన్నాధ్‌తో ఈ సినిమా ఎలా కుదిరింది?
- ‘పటాస్’ సినిమా చేసిన తరువాత పూరి జగన్నాథ్‌తో సినిమా చేయాలని అన్పించింది. వెంటనే ఆయన్ని కలిశాను. అప్పుడు కథ చెప్పగానే చాలా ఎగ్జైట్ అయ్యి సినిమా చేయడానికి సిద్ధమయ్యాను. అంతకుముందు వేరే సినిమా చేయాలని వున్నా కూడా రాజవౌళి, త్రివిక్రమ్ లాంటి దర్శకులు పిలిస్తే అన్నీ వదిలేసుకుని వెళ్లమా! ఇదీ అలాగే జరిగింది.
* సిక్స్‌ప్యాక్ గురించి?
- కథ చెప్పిన తరువాత పాత్రకోసం సన్నబడాలి, సిక్స్‌ప్యాక్ కూడా వుంటే బాగుంటుందని ఆయన సూచించారు. దానికోసం నాలుగు నెలల టైమ్ అడిగాను. అన్ని రకాల కష్టాలకు ఓర్చి సిక్స్‌ప్యాక్ చేశాను. నిజంగా సినిమా చేసిన తరువాత ఆ పాత్ర ఇంత బాగా వచ్చిందా అని నేను షాకయ్యా!
* ఈమధ్య పూరి జగన్నాథ్‌కు పరాజయాలు ఎక్కువగా వున్నాయి కాబట్టి సినిమా చేయడానికి ఆలోచించలేదా?
- ఏ నటుడు, దర్శకుడికైనా జయాపజయా లు సాధారణమే. ఈ దర్శకుడికి ఖచ్చితంగా హిట్ వస్తుందని ఎప్పుడూ ఎవరూ చెప్పలేరు. మనం నమ్మినదాన్ని వందశాతం చేసుకుంటూ పోవడమే మన పని.
* మీరు సినిమాను నమ్మితే ఎంతవరకైనా వెళ్తారని విన్నాం? దానివల్ల ఇబ్బందులు కలగవా?
- కొన్నిసార్లు తప్పవు. ఒక సినిమాను నమ్మినప్పుడు దానికోసం ఖర్చుపెట్టక తప్పదు. ఈ విషయంలో ఓం సినిమా బాగా ఇబ్బందులు పెట్టింది. నమ్మినప్పుడు ఎంతైనా చేయాల్సిందే. ఏ సినిమాకైనా ఓవర్ బడ్జెట్ అనేది నేను ఎప్పుడూ పెట్టను.
* హీరోయిన్ గురించి?
- ఇందులో అదితి ఆర్య హీరోయిన్‌గా పరిచయమవుతుంది. ఏదో నాలుగు పాటలు, గ్లామర్ అని కాకుండా ఆమె పాత్రకంటూ ప్రత్యేకత వుంటుంది. తను చాలా బాగా చేసింది.
* ఎన్టీఆర్‌తో మీ బ్యానర్‌లో ఓ సినిమా ప్రకటించారు కదా?
- రచయిత వక్కంతం వంశీ దర్శకత్వంలో ఎన్టీఆర్‌తో సినిమా చేయాలని అనుకున్నాం. కానీ కథ కుదరలేదు. దాంతో ఆ సినిమా పోస్ట్‌పోన్ అయింది.
* ఎన్టీఆర్‌తో మీ రిలేషన్ ఎలా వుంటుంది?
- మేమిద్దరం అన్నీ షేర్ చేసుకుంటాం. ముఖ్యంగా సినిమాల విషయాలన్నింటినీ చర్చిస్తుంటాం.
* తదుపరి చిత్రాలు?
- ప్రస్తుతానికి చర్చల దశలో ఉన్నాయి. ఇప్పటికే సాయిధరమ్‌తేజ్‌తో కలిసి ఓ సినిమా చేయడానికి చర్చలు జరుగుతున్నాయి. దాంతోపాటు మరో సినిమా కూడా త్వరలోనే తెలుపుతా.

-శ్రీ