బాహుబలిని మిస్ అయ్యా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాహుబలి తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలకు చాటి, ఇండియన్ సినిమాపై తనదైన ముద్రను వేసుకుంది. మరోవైపు బాక్సాఫీస్ వద్ద ఘనవిజయాన్ని నమోదుచేసుకుని సంచలనం సృష్టించింది. అయితే ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించే అవకాశాన్ని మిస్ చేసుకున్నానని చెబుతోంది బాలీవుడ్ ముద్దుగుమ్మ సోనమ్‌కపూర్. అనిల్‌కపూర్ కూతురుగా ఇండస్ట్రీలోకి ప్రవేశించి చాలా చిత్రాలు చేసిన ఈమెకు కమర్షియల్‌గా గుర్తింపు తెచ్చే విజయాలేవీ దక్కలేదు. ఇటీవలే నీర్జాతో విజయాన్ని అందుకున్న ఈ భామ, ఓ కార్యక్రమంలో పాల్గొని ఈ కామెంట్ చేసింది. సోనమ్‌కపూర్ మాట్లాడుతూ- బాహుబలి గొప్పచిత్రమని, తానింకా సినిమా చూడలేదని చెప్పింది. నిజానికి ఈ సినిమాలో నటించే అవకాశం మొదట నాకే వచ్చిందని, స్క్రిప్ట్ మొత్తం విన్నానని, కానీ ఎందుకో కుదరక చేయలేదని చెప్పి షాక్ ఇచ్చింది. ఆమె కామెంట్స్‌తో ఎందుకు ఇంత మంచి అవకాశాన్ని సోనమ్ వదులుకుందన్నదే ఇప్పుడు అందరిలో చర్చనీయాంశమైంది. అయితే, సోనమ్‌ని రాజవౌళి అడిగింది తమన్నా పాత్ర కోసమా? లేక మరే పాత్రా? అనేది తెలియరాలేదు. మొత్తానికి గొప్ప చిత్రంలో నటించే అవకాశాన్ని మాత్రం సోనమ్ మిస్ చేసుకుంది.