S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/05/2016 - 21:21

సేతు, అభిషేక్, రాజ్, పూజ ప్రధాన పాత్రల్లో సురేష్ కుమార్ మరియు రాజ్ దర్శకత్వంలో సెలెబ్స్ అండ్ రెడ్ కార్పెట్ బ్యానర్ పతాకంపై రాజ్ జకారిస్ నిర్మిస్తున్న చిత్రం ‘రహదారి’. అన్ని కార్యక్రమాలు పూర్తికావచ్చిన ఈ చిత్రం ఈనెల 13న విడుదలవుతున్న సందర్భంగా చిత్ర వివరాలను నిర్మాతలు తెలియజేశారు.

05/05/2016 - 21:20

మహేష్‌బాబు హీరోగా నటించిన ‘1’ (నేనొక్కడినే) సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన గ్లామర్ భామ కృతి సనన్‌కు ఆ తరువాత తెలుగులో అవకాశాలు వచ్చినా కూడా కమర్షియల్‌గా విజయాన్ని అందుకోలేకపోయింది. దాంతో బాలీవుడ్‌లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్న ఈమెకు నిరాశే మిగిలింది. దాంతో ఇప్పుడు తన చెల్లెలు నుపుర్ సనన్‌ను రంగంలోకి దింపుతోంది.

05/05/2016 - 21:17

మానస్, సనమ్‌శెట్టి జంటగా కళాసందీప్ దర్శకత్వంలో ఎస్.ఎస్.సినిమాస్ పతాకంపై లక్ష్మీనారాయణరెడ్డి, కె.ఇసనాక సునీల్‌రెడ్డి నిర్మించిన చిత్రం ‘ప్రేమికుడు’.

05/05/2016 - 21:15

మాజీ క్రికెటర్ అజారుద్దీన్ జీవిత కథ ఆధారంగా నిర్మిస్తున్న ‘అజహర్’ సినిమా ప్రమోషన్‌కోసం ముంబైలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న బాలీవుడ్ తార ప్రాచీదేశాయ్.

05/05/2016 - 21:12

‘బెంగాల్ టైగర్’ సినిమా తరువాత రవితేజ నటించే సినిమా ఇంకా ఏదీ సెట్స్‌పైకి రాలేదు. ఇప్పటికే రెండు మూడు ప్రాజెక్టులు చర్చల దశలో వున్నా కూడా ఒక్క సినిమా షూటింగ్ కూడా మొదలుపెట్టలేదు రవితేజ. ఆమధ్య దిల్‌రాజు బ్యానర్‌లో ‘ఎవడోఒకడు’ ప్రాజెక్టు సెట్ అయి చివరిదశలో ఆగిపోయింది. దాంతో చక్రి అనే కొత్త దర్శకుడితో సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు.

05/05/2016 - 21:11

నందమూరి బాలకృష్ణ తన వందో చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించే సన్నాహాలు చేస్తున్నారు. అఖండ భారతాన్ని పరిపాలించిన తొలి తెలుగు రాజు గౌతమీపుత్ర శాతకర్ణి కథతో తెరకెక్కే ఈ చిత్రం ఇటీవలే ప్రారంభమైన విషయం తెలిసిందే. క్రిష్ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జూన్ నుండి ప్రారంభం కానుంది. ఈ చిత్రం ద్వారా బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ సినిమాల్లో ఎంట్రీ ఇవ్వనున్నట్టు సమాచారం.

05/05/2016 - 21:07

ప్రస్తుతం ‘బ్రహ్మోత్సవం’ చిత్రంలో నటిస్తున్నాడు మహేష్‌బాబు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కోలీవుడ్ నుండి బాలీవుడ్ వరకూ అందరూ మహేష్ పేరునే జపిస్తున్నారు. మహేష్‌తో సినిమాలు చేయడానికి దర్శకులు కూడా క్యూ కడుతున్నారు. బ్రహ్మోత్సవం తరువాత మహేష్, మురగదాస్ దర్శకత్వంలో రూపొందే సినిమా జూన్‌లో ప్రారంభం కానుంది.

05/05/2016 - 21:06

‘గమ్యం’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన క్రిష్ రూపొందించిన ‘కంచె’ చిత్రానికి ప్రాంతీయ ఉత్తమ చిత్రంగా 2015కుగాను జాతీయ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. ఈ అవార్డును ఇటీవలే దిల్లీలో రాష్టప్రతి చేతులమీదుగా అందుకున్న ఆయన ఆ పురస్కారంక్రింద వచ్చిన నగదును హైదరాబాద్‌లోని బసవతారకం ఇండో అమెరికన్ కాన్సర్ ఆసుపత్రికి విరాళంగా ప్రకటించాడు. నటుడు బాలకృష్ణను కలిసి ఈ చెక్కును అందజేశారు.

05/05/2016 - 00:43

ప్రస్తుతం బాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా వెలుగొందుతున్న గ్లామర్ భామ దీపికా పదుకొనె త్వరలోనే తెలుగు సినిమాల్లో నటించేందుకు రంగం సిద్ధమైంది. మహేష్‌బాబు సరసన ఆమె హీరోయిన్‌గా నటిస్తుందంటూ వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం ‘బ్రహ్మోత్సవం’ చిత్రంలో నటిస్తున్న మహేష్‌బాబు తన తదుపరి చిత్రానికి రెడీ అయ్యాడు.

05/05/2016 - 00:42

దక్షిణాదిలో టాప్ హీరోయిన్‌గా గుర్తింపుతెచ్చుకున్న శ్రుతిహాసన్ ‘శ్రీమంతుడు’ సినిమా తరువాత దక్షిణాదిపై పెద్దగా ఆసక్తి చూపడంలేదు. బాలీవుడ్‌లో హీరోయిన్‌గా సెటిల్ అవ్వాలనే రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. తెలుగులో ‘ప్రేమమ్’ సినిమాలో మాత్రమే నటిస్తున్న ఈమె, తాజాగా కమల్ హీరోగా నటిస్తున్న ‘శభాష్ నాయుడు’ చిత్రంలో నటిస్తోంది.

Pages