అభినవ మోహిని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దశాబ్దకాలంపాటు టాప్ హీరోయిన్‌గా దక్షిణాదిలో హవా కొనసాగించిన అందాల భామ త్రిష ఈమధ్య కెరీర్ బాగా వెనుకబడింది. దాంతో కాస్త గ్యాప్ తీసుకుని సెకెండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఈ భామకు కొత్త తరహా అవకాశాలు వస్తున్నాయి. ఇటీవలే ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘నాయకి’ చిత్రం భారీ పరాజయం పాలవ్వడంతో, ఇప్పుడు చేస్తున్న ‘మోహిని’ సినిమాపై ఎక్కువ ఆశలు పెట్టుకుంది. హారర్ కామెడీ నేపథ్యంలో రూపొందుతున్న ‘మోహిని’ షూటింగ్ దాదాపు పూర్తికావచ్చింది. లండన్, థాయ్‌లాండ్‌లలో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను బుధవారం విడుదల చేశారు. వెస్ట్రన్ అవతారంలో వున్న భద్రకాళిలా త్రిష లుక్ కొత్తగా వుంది. ఆర్.మాదేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం త్వరలోనే విడుదలకు సిద్ధమైంది.