ఇంట్లోకి దెయ్యం వస్తే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్లరి నరేష్, దర్శకుడు జి.నాగేశ్వర్‌రెడ్డిల కాంబినేషన్‌లో వచ్చిన ‘సీమటపాకాయ్, సీమశాస్ర్తీ’ చిత్రాలు ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. వారి కాంబినేషన్‌లో హాట్రిక్ చిత్రంగా రూపొందుతోంది ‘ఇంట్లో దెయ్యం నాకేం భయం’. భారీ చిత్రాల నిర్మాత భోగవల్లి ప్రసాద్, శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై రూపొందుతోన్న ఈ సినిమా టీజర్ విడుదలైంది. ఈ సందర్భంగా నిర్మాత భోగవల్లి ప్రసాద్ మాట్లాడుతూ- నరేష్-నాగేశ్వర్‌రెడ్డిల కాంబినేషన్‌లో రూపొందుతున్న ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్ ఇది. అత్తారింటికి దారేది, నాన్నకు ప్రేమతో సినిమాల తరువాత తమ బ్యానర్‌లో రూపొందుతున్న ఈ సినిమా తప్పకుండా సూపర్‌హిట్ అవుతుందని అన్నారు. త్వరలోనే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి నవంబర్ 11న చిత్రాన్ని విడుదల చేస్తామన్నారు. దర్శకుడు నాగేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ- మంచి కథ, అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే ఈ సినిమా హర్రర్‌తో మిక్స్ అయిన ఫ్యామిలీ డ్రామా అని, నరేష్‌కు, తనకు మంచి హిట్ సినిమా అవుతుందని అన్నారు.