పాటలకు రంగం-2 సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీవా హీరోగా నటించిన రంగం ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. కె.వి.ఆనంద్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు సీక్వెల్‌గా రంగం-2 చిత్రాన్ని రూపొందించారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రవి కె.చంద్రన్ దర్శకత్వంలో తమిళంలో రూపొందిన ‘యాన్’ చిత్రాన్ని జస్‌రాజ్ ప్రొడక్షన్స్ సమర్పణలో శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ పతాకంపై ఎ.ఎన్.బాలాజీ రంగం-2 పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ చిత్ర వివరాల్ని నిర్మాత తెలియజేస్తూ- జీవా హీరోగా నాటి అందాల హీరోయిన్ రాధ చిన్న కూతురు తులసి నాయర్ హీరోయినగా నటించిన ఈ చిత్రం తమిళంలో ఘనవిజయం సాధించింది. హరీష్ జైరాజ్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటల్ని త్వరలోనే విడుదల చేయనున్నాం. అన్ని రకాల కమర్షియల్ హంగులతో తెరకెక్కిన ఈ చిత్రం రంగం లాంటి విజయాన్ని సాధిస్తుందన్న నమ్మకం వుంది అన్నారు. ఈ చిత్రానికి సంగీతం:హరీశ్ జైరాజ్, ఎడిటింగ్:శ్రీకర్ ప్రసాద్, నిర్మాత:ఎ.ఎన్.బాలాజీ (సూపర్‌గుడ్ బాలాజీ), దర్శకత్వం:రవి కె.చంద్రన్.