తొలిసారి పోలీసుగా నటిస్తున్నా-- నారాయణమూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విప్లవ కథా చిత్రాల హీరో నారాయణమూర్తి, జయసుధ కీలక పాత్రల్లో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ పతాకంపై చదలవాడ శ్రీనివాసరావు దర్శకత్వంలో చదలవాడ పద్మావతి నిర్మిస్తున్న ‘హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య’ చిత్రం బుధవారం ఫిలిం సిటీలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత రామోజీరావు క్లాప్‌నివ్వగా, ఫిలింసిటీ ఎం.డి. రామోహన్‌రావు కెమెరా స్విచ్చాన్ చేశారు. దర్శకుడు ఎస్.వి.కృష్ణారెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో నారాయణమూర్తి మాట్లాడుతూ- ‘ ఇందులో హెడ్‌కానిస్టేబుల్‌గా నటిస్తున్నాను. నేను ఏ సినిమా చేసినా సరే, పోలీస్ తమ్ముళ్ళు నా దగ్గరికివచ్చి అన్నా! మా వేషం వేయచ్చు కదా అని అడిగేవారు. ఈ సినిమాతో ఆ అవకాశం వచ్చింది. నాకు సావిత్రిగారంటే ఇష్టం. ఆ తరువాత జయసుధ గారి నటన ఇష్టం. ఈ సినిమాలో ఆమెతో పనిచేయడం ఆనందంగావుంది’ అన్నారు. దర్శకుడు శ్రీనివాసరావు మాట్లాడుతూ- సినిమా పవర్‌ఫుల్ మీడియా ఎప్పుడూ అడ్వాన్స్‌గా ఆలోచిస్తుంది. రామోజీరావు తీసిన ‘మయూరి’ ఎంత స్ఫూర్తినింపిందో తెలిసిందే. అలాగే, ఈమధ్యే మేం తీసిన ‘బిచ్చగాడు’ కూడా మంచి సినిమాగా గుర్తింపు తెచ్చుకుంది. ఐదేళ్ళక్రితం రామోజీరావు ఆరాధ్ క్రాంతి అనే మీటింగ్‌ను పెట్టారు. అందులో బ్లాక్‌మనీవల్ల ఎంత నష్టం జరుగుతుంది, దానివల్ల మధ్యతరగతివాళ్లు ఎలా నష్టపోతున్నారు అనే అంశాలు నన్ను చాలాకాలం వెంటాడాయి. దాంతో ఆ విషయాలన్నీ కూర్చి ఈ సినిమాను సిద్ధం చేశాను. ఈ కథకు నారాయణమూర్తి అయితేనే కరెక్టు అని, ఆయన్ను అడిగితే ఒప్పుకున్నారు. జయసుధగారు కూడా అంగీకరించినందుకు వారికి ధన్యవాదాలు. సినిమా మొత్తం సింగిల్ షెడ్యూల్‌లో తీసి జనవరిలో విడుదల చేస్తాం’ అన్నారు. జయసుధ మాట్లాడుతూ- ఈ సినిమా నాకు చాలా స్పెషల్. కొన్ని కథలు, కాంబినేషన్లు కొత్తగా అన్పిస్తాయి. ఇది కూడా అలాగే అన్పించింది. నారాయణమూర్తి ఎప్పటినుంచో తెలుసు. ఆయనతో పనిచేయడం ఇదే మొదటిసారి’ అన్నారు.