పాటల్లో కోటీశ్వరుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నవీన్‌చంద్ర, శ్రుతిశోధి, సలోని ముఖ్యపాత్రల్లో ఇ.సత్తిబాబు దర్శకత్వంలో శ్రీసత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్న ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ చిత్రంలోని పాటలు హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. ఈ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అల్లరి నరేష్ సీడీని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, పృధ్వీ తనదైన కామెడీతో దుమ్ము రేపుతున్నాడని, ట్రైలర్, సాంగ్స్ బావున్నాయని, ఈ సినిమాతో నవీన్‌చంద్రకు మంచి హిట్ దక్కాలని అన్నారు. హీరో ఆది మాట్లాడుతూ, పృధ్వీ స్క్రీన్‌పై కనపడగానే థియేటర్‌లో ఈలలు పడుతున్నాయని అన్నారు. నవీన్ చంద్ర మాట్లాడుతూ, మంచి టీమ్‌తో రూపొందిన సినిమా ఇది. శృతి, పృధ్వీ, సలోనిలతో పనిచేయడం ఆనందంగా వుందని అన్నారు. ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్‌గా సత్తిబాబు తెరకెక్కించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందిస్తుందని అన్నారు. నిర్మాత రాధామోహన్ మాట్లాడుతూ, పృధ్వీ నటన సినిమాకు పెద్ద ప్లస్ అని, ప్రేక్షకులందరూ ఎంజాయ్ చేసే సినిమా ఇది అన్నారు. దర్శకుడు సత్తిబాబు మాట్లాడుతూ, ఇంటిల్లిపాదినీ అలరించే సినిమా ఇది అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రుతిశోధి, సలోని, పృధ్వీ, కిరణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.