S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

10/04/2016 - 23:50

రఫ్ అండ్ టఫ్‌గా తిరిగే కుర్రాళ్ళ కథనంతో నలుగురు బాల నేరస్థుల కథతో రూపొందించిన ‘మాంజా’ చిత్రం అందరికీ నచ్చిందని కథానాయకుడు దీప్ పాథక్ తెలిపారు. భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ అందించిన ‘మాంజా’ చిత్రం ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రం అన్ని కేంద్రాల్లో మంచి రెస్పాన్స్‌తో సాగుతోందని ఆయన తెలియజేశారు.

10/04/2016 - 23:50

‘ప్రేక్షకులకు హైపర్ చిత్రం ద్వారా ఏం చెప్పాలనుకున్నామో ఆ మెసేజ్ అందిందనే భావిస్తున్నాం. ఎందుకంటే, విడుదలైన అన్ని కేంద్రాల్లో ఇదేవిధంగా రిపోర్ట్స్ వస్తున్నాయి. ఓ ఉద్యోగి తన సర్వీసులో ఎదుర్కొనే ఒడిదుడుకులను ఈ చిత్రంలో కమర్షియల్ మాస్ ఎంటర్‌టైనర్‌గా చెప్పాం’ అని నిర్మాతలు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర రూపొందించిన ‘హైపర్’ చిత్రం విడుదలైన సంగతి తెలిసిందే.

10/04/2016 - 23:48

సందీప్, కోమలి, భవ్యశ్రీ ప్రధాన తారాగణంగా సందీప్‌కిషన్ క్రియేషన్స్ ప పతాకంపై డా వెంకన్న రూపొందించిన చిత్రం ‘నేనూ సీతాదేవి’. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 14న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ- ఆహ్లాదంగాసాగే ప్రేమకథా చిత్రంగా రూపొందిన ఈ సినిమాలో కమర్షియల్ అంశాలు అన్నీ వుంటాయని తెలిపారు.

10/02/2016 - 21:37

సప్తగిరి, రోషిణీప్రకాష్ జంటగా సాయి సెల్యులాయిడ్ సినిమాటిక్ క్రియేషన్స్ పతాకంపై అరుణ్‌పవార్ దర్శకత్వంలో కె.రవికిరణ్ రూపొందిస్తున్న చిత్రం ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’. ఈ చిత్రానికి సంబంధించిన బ్యానర్ లోగోను, మోషన్ పోస్టర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా సప్తగిరి మాట్లాడుతూ హాస్యనటుడిగా ఉన్న తాను ఈ సినిమాతో హీరోగా మారానని, నన్ను నమ్మిన నిర్మాతలకు, దర్శకుడికి కృతజ్ఞతలని తెలిపారు.

10/02/2016 - 21:36

‘హీరోయిన్ ఎలా ఉంటే ప్రేక్షకులు ఇష్టపడతారో అలా హైపర్ చిత్రంలో నేను నటించాను. అందులో రెండు పాత్రల్లో వైవిధ్యమైన షేడ్స్ చూపడం మరింత ఆనందాన్నిస్తోంది. ఒకటి కళ్లజోడుతో అమాయకంగా కనిపించే భానుమతిలా, మరొకటి పక్కా మాస్ మసాలాతో మోడరన్‌గా ఉండే అమ్మాయిలా రెండు షేడ్స్‌ను దర్శకుడు ఎలా జెబితే అలా చేసుకుంటూ వెళ్లాను’ అని నటి రాశీఖన్నా తెలిపారు.

10/02/2016 - 21:34

రామ్ కథానాయకుడుగా నటించిన హైపర్ చిత్రం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రభుత్వ ఉద్యోగి ఎలా ఉండాలి అన్న కథనం చర్చించిన నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ ఉద్యోగులకోసం ప్రత్యేకంగా ప్రదర్శనలు నిర్వహించారు.

10/02/2016 - 21:32

నందమూరి కల్యాణ్‌రామ్ కథానాయకుడుగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నందమూరి తారకరామారావు ఆర్ట్స్ పతాకంపై రూపొందిస్తున్న పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఇజం’. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సినిమాను అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి, అక్టోబర్ 20న విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నారు.

10/02/2016 - 21:30

గుంటూర్ టాకీస్ గతంలో విడుదలై సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ రూపొందిస్తున్నారు. ఆర్‌కె స్టూడియోస్ పతాకంపై రాజ్‌కుమార్ ఎం. నిర్మాణ సారధ్యంలో ‘గుంటూర్ టాకీస్-2’ చిత్రాన్ని లాంఛనంగా హైదరాబాద్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజ్‌కుమార్ ఎం.

10/02/2016 - 21:28

గోపీచరణ్, ఐశ్వర్య అడ్డాల జంటగా రామ్‌క్రియేషన్స్ పతాకంపై రెడ్డెం యాదకుమార్ దర్శకత్వంలో పీరికట్ల రాము రూపొందిస్తున్న చిత్రం ‘నేత్ర’ (మై స్వీట్ హార్ట్). ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ విశాఖపట్నం, అరకు, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరిపి, పూర్తిచేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా నిర్మాత పీరికట్ల రాము మాట్లాడుతూ..

10/02/2016 - 21:27

చక్కని ప్రేమకథా చిత్రంగా రూపొందిన ‘నీ జతలేక’ విడుదలై అన్ని కేంద్రాలలో భారీ ఓపెనింగ్స్ సాధించి సూపర్‌హిట్‌గా నిలుస్తోందని నిర్మాతలు జి.వి.చౌదరి, నాగరాజ్‌గౌడ్ చిర్రా తెలిపారు. నాగశౌర్య, పారుల్ యాదవ్, సరయు ప్రధాన పాత్రధారులుగా సత్యవిదుర మూవీస్ పతాకంపై లారెన్స్‌దాసరి దర్శకత్వంలో రూపొందించిన ‘నీ జతలేక’ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన విజయోత్సవ కార్యక్రమం హైదరాబాద్‌లో నిర్వహించారు.

Pages