S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

10/23/2016 - 03:29

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శివ కార్తికేయన్, కీర్తిసురేష్ జంటగా బక్కియరాజ్ కన్నన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘రెమో’. నిర్మాత రాజు తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్‌లుక్, పాటల విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది.

10/23/2016 - 03:28

ఓం శ్రీ క్రియేషన్స్ బ్యానర్‌లో అనిల్, శృతిలయ జంటగా, ఎం.ఎస్.బైరారెడ్డి, నాగరాజు నిర్మాతలుగా, ఆర్.కె.గాంధీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘ప్రేమభిక్ష’. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ జరుగుతోంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ, ‘అనంతపురం జిల్లా భద్రపట్నం గ్రామంలో జరిగిన యథార్థ ఘటనను తీసుకుని దర్శకుడు గాంధీ ఓ మంచి కథను తయారుచేశాడు.

10/23/2016 - 03:27

ధనుష్ కథానాయకుడిగా తమిళంలో రూపొందించిన ‘కొడి’ చిత్రాన్ని తెలుగులో ‘్ధర్మయోగి’ (ది లీడర్) పేరుతో విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సిహెచ్.సతీష్‌కుమార్ అనువదించారు. ఆర్.ఎస్.దురై సెంథిల్‌కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి సంబంధించిన పాటల విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. హీరో ధనుష్ తొలి సీడీని ఆవిష్కరించారు.

10/23/2016 - 03:27

సారా అర్జున్ ప్రధాన పాత్రలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ పతాకంపై చదలవాడ పద్మావతి అందిస్తున్న చిత్రం ‘పిల్ల రాక్షసి’. మిథున్ మాథ్యూస్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి సంబంధించిన ఆడియోను, ట్రైలర్‌ను హీరో అల్లరి నరేష్ ప్రసాద్ లాబ్‌లో విడుదల చేశారు.

10/21/2016 - 21:06

సినిమా రూపొందించే సమయంలో ప్రతి నిర్మాత, తన చిత్రం వంద రోజులు ఆడాలని కోరుకుంటాడు. అయితే ఆ చిత్ర దర్శకుడి ప్రతిభ, సాంకేతిక నిపుణుల పనితనం, నటీనటుల నటనాచాతుర్యం వెరసి ఆ చిత్రాన్ని మంచి చిత్రంగా రూపుదిద్దితే ఢోకాలేదు.

10/21/2016 - 21:04

నక్షత్రం చిత్రానికి సంబంధించిన సాయిధరమ్‌తేజ్ ఫస్ట్‌లుక్‌ను శుక్రవారం విడుదల చేశారు. యాంగ్రీ యంగ్‌మెన్‌గా
సాయిధరమ్ కనిపిస్తున్న ఈ ఫస్ట్‌లుక్‌కు ఆదరణ లభిస్తోంది.

10/21/2016 - 21:02

తమిళంతోపాటు తెలుగులో కూడా స్టార్ ఇమేజ్‌ను దక్కించుకున్న ప్రముఖ కథానాయకుడు సూర్య నటిస్తన్న తాజా చిత్రం ‘సింగం-3’. గతంలో వచ్చిన ‘సింగం’, ‘సింగం-2’ చిత్రాలు ఘనవిజయాలు సాధించిన సంగతి తెలిసిందే. సింగం సిరీస్‌లో భాగంగా హరి దర్శకత్వంలో తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కుతున్న సీక్వెల్ సింగంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.

10/21/2016 - 21:01

ముంబైలో బాలీవుడ్ తారలు ఒక్కచోట చేరారు. 18న ముంబై ఫిల్మ్ ఫెస్టివల్ (మామి) ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించిన షోలో రెడ్‌కార్పెట్‌పై బాలీవుడ్ భామలు చేసిన క్యాట్‌వాక్ ఆహూతులను అలరించింది.

10/21/2016 - 20:54

‘జనతా గ్యారేజ్’ సినిమాతో తెలుగులోనూ సూఫర్‌హిట్ అందుకున్న మోహన్‌లాల్ దసరా కానుకగా ‘పులి మురుగన్’ చిత్రం త్వరలోనే తెలుగు నాట కూడా సందడి చేయనుంది. తెలుగులో ‘మన్యం పులి’ పేరిట శ్రీ సరస్వతి ఫిల్మ్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత సింధూరపువ్వు కృష్ణారెడ్డి విడుదల చేస్తున్నారు. విడుదలైన తొలివారంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా మల్లూవుడ్‌లో ‘పులిమురుగన్’ రికార్డ్ క్రియేట్ చేసింది.

10/21/2016 - 20:52

ఐదుగురు కథానాయికలతో సి.ఎల్. మీడియా తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్న చిత్రం ‘100 డిగ్రీ సెల్సియస్’. మిత్రన్ ఆర్.జవహర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లోని ప్రముఖ నటులతో రూపొందుతోంది. హైటెక్నికల్ వేల్యూస్‌తో ఎక్కడా కాంప్రమైజ్ అవకుండా చాలా లావిష్‌గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాయ్‌లక్ష్మీ, నికిషాపటేల్, అరుంధతి నాయర్ ప్రధాన పాత్రధారులుగా నటిస్తున్నారు.

Pages