వెరైటీ ప్రేమతో చిన్నవాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిఖిల్, హేబాపటేల్, నందితాశే్వత ప్రధాన తారాగణంగా మేఘన ఆర్ట్స్ పతాకంపై వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా హీరో నిఖిల్ మాట్లాడుతూ డిఫరెంట్ కానె్సప్ట్‌తో వైవిధ్యమైన ప్రేమకథతో ఈ చిత్రాన్ని రూపొందించారని, ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి స్పందన లభిస్తోందని తెలిపారు. సోషల్ మీడియాలో ఈ చిత్రానికి భారీ అంచనాలు నెలకొన్నాయని, నవంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలిపారు. ఈనెల చివరి వారంలోగానీ, వచ్చేనెల మొదటివారంలో గానీ ఆడియో విడుదల ఉంటుందని, తన గత చిత్రాల మాదిరిగానే ఈ సినిమా అందర్నీ ఆకట్టుకుంటుందని ఆయన వివరించారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అంశాన్ని మీడియా వైవిధ్యంగా ప్రజెంట్ చేశారని, ఆద్యంతం సినిమా నవ్వించడమే కాక సూపర్ థ్రిల్‌తో ప్రేక్షకులను అలరిస్తుందని దర్శకుడు వి.ఐ.ఆనంద్ అన్నారు. వెనె్నల కిషోర్, తనికెళ్ల భరణి, సత్య, తా.రమేష్, జోష్ రవి, సుదర్శన్, భద్రమ్, అపూర్వ, శ్రీనివాస్ తదితరులు నటించిన ఈ చిత్రానికి పాటలు: రామజోగయ్యశాస్ర్తీ, శ్రీమణి, ఎడిటింగ్: చోటా కె.ప్రసాద్, సంగీతం: శేఖర్‌చంద్ర, మాటలు: అబ్బూరి రవి, కెమెరా: సాయిశ్రీరామ్, నిర్మాణం: మేఘన ఆర్ట్స్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వి.ఐ.ఆనంద్.