S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

10/21/2016 - 20:48

బ్రహ్మాజి ముఖ్యపాత్రలో మహేంద్ర.ఇ.ఎమ్.ఎస్, కాత్యాయని శర్మలు నటీనటులుగా ప్రేమ కవితాలయ ఫిలింస్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం ‘ట్రాప్’. ప్రస్తుతం షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్‌ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని డిసెంబర్‌లో విడుదల చేసే ఆలోచన చేస్తున్నామని నిర్మాత ఆళ్ళ స్వర్ణలత తెలియజేశారు.

10/21/2016 - 20:46

అల్లాణి శ్రీ్ధర్ స్వీయ దర్శకత్వంలో ఫిల్మీడియా ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మించిన ‘చిలుకూరి బాలాజీ’ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుంది. యువతరానికి వీసాల బాలాజీగా తన ఆశీర్వాదాలు అందిస్తూ తరతరాలుగా అందరిచే ఆరాధింపబడుతున్న చిలుకూరి బాలాజీ ప్రాశస్త్యతను, ఈ ఆలయ స్థల పురాణాన్ని ఒక దృశ్య కావ్యంగా చిత్రీకరించారు.

10/20/2016 - 21:00

ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున హీరోగా కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఓం నమో వెంకటేశాయ’. అన్నమయ్య, శ్రీరామదాసు, షిర్డీ సాయి చిత్రాల తరువాత వీరి కాంబినేషన్‌లో వస్తోన్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. శ్రీవారి మహాభక్తుడైన హాథీరామ్ బాబా జీవిత కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇప్పటకే సగానికిపైగా షూటింగ్ పూర్తిచేసుకుంది.

10/20/2016 - 20:59

వరుస సినిమాలతో జోరుమీదున్నాడు నారా రోహిత్. తనకు నచ్చిన కానె్సప్టులను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నాడు. ఆయన తాజాగా నటిస్తున్న చిత్రం ‘శంకర’. తాతినేని సత్యప్రకాష్ దర్శకత్వంలో శ్రీ లీలా మూవీస్ పతాకంపై చంద్రవౌళి ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ రోజు విడుదలవుతున్న సందర్భంగా నారా రోహిత్ చెప్పిన విశేషాలు...

10/20/2016 - 20:57

పోలీస్ అమరవీరుల స్మారకదినోత్సవం సందర్భంగా సంగీత దర్శకుడు రమేష్ ముక్కెర ‘పోలీస్ పోలీస్’ ఆడియో ఆల్బంను రూపొందించారు. ఈ ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం గురువారం హైదరాబాద్‌లో జరిగింది. తెలంగాణ హోం శాఖామంత్రి నాయిని నరసింహారెడ్డి సీడీలను విడుదల చేశారు. అనంతరం ఫిలిం ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో సంగీత దర్శకుడు రమేష్ ముక్కెర మాట్లాడుతూ- ‘నేను గత 20 ఏళ్లుగా పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్నా.

10/20/2016 - 20:55

‘స్వామిరారా’తో మంచి విజయాన్ని అందుకున్న నిఖిల్, దర్శకుడు సుధీర్‌వర్మల కాంబినేషన్‌లో అభిషేక్ పిక్చర్స్ పతాకంపై నిర్మితమవుతున్న చిత్రానికి ‘కేశవ’ టైటిల్‌ను ఖరారు చేశారు. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తిచేసుకున్న ఈ సినిమా గురించి నిర్మాత అభిషేక్ నామా మాట్లాడుతూ- ‘హుషారైన ఓ కుర్రాడు ఎవరిపై పగపట్టాడు? అసలు పగ, ప్రతీకారాలంటూ ఎందుకు తిరుగుతున్నాడనే ఆసక్తికరమైన కథాంశంతో తెరకెక్కుతున్న సినిమా ఇది.

10/20/2016 - 20:55

రంగం ఫేం జీవా, కాజల్ జంటగా డి.కె. దర్శకత్వంలో ‘కావలైవేండాం’ తమిళ చిత్రాన్ని తెలుగులో డి.వి. సినీ క్రియేషన్స్ పతాకంపై డి.వెంకటేష్ ‘ఎంతవరకు ఈప్రేమ’ పేరుతో అనువదిస్తున్నాడు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రం గురించి నిర్మాత డి.వెంకటేష వివరాలు తెలియజేస్తూ- పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి. ఈ చిత్రంలోని పాటలని 27న విడుదల చేస్తున్నాం.

10/20/2016 - 20:53

తెలంగాణ ఉద్యమ నాయకుడు, ముఖ్యమంత్రి కెసిఆర్ జీవితం తెరకెక్కనుంది. దర్శకుడు మధుర శ్రీ్ధర్ దర్శకత్వంలో తెరకెక్కే ఈ చిత్రాన్ని ధర్మపధ క్రియేషన్స్ పతాకంపై రాజ్ కందుకూరి నిర్మిస్తున్నాడు. ఈ సినిమా గురించి దర్శకుడు శ్రీ్ధర్‌రెడ్డి తెలుపుతూ- ‘కెసిఆర్ అనే మూడక్షరాలు తెలంగాణ ఉద్యమానికి చిరునామాగా మారాక దేశం మొత్తం ఉద్యమాన్ని ఒక సానుకూల ధోరణిలో చూడడం మొదలుపెట్టింది.

10/20/2016 - 20:52

అప్పట్లో టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గ క్రేజ్ తెచ్చుకున్న గ్లామర్ భామ శ్రీయాకు ఈమధ్య క్రేజ్ బాగా తగ్గింది. దాంతో సినిమాలూ తగ్గాయి. వస్తున్న అడపా దడపా అవకాశాల్ని అందిపుచ్చుకుంటున్న ఈ భామ, ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ సరసన ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ చిత్రంలో నటిస్తోంది.

10/20/2016 - 20:50

ప్రస్తుతం తెలుగులో వరుస సినిమాలు చేస్తూ బిజీగా వున్న రెజీనా గట్టి షాకే ఇచ్చింది. తన ట్విట్టర్‌లో నిశ్చితార్థానికి సంబంధించిన ఫొటో ఒకటి పోస్ట్ చేసి సంచలనం రేపింది. ఫొటో చూసినవారందరూ రెజీనాకు నిశ్చితార్థం జరిగిందా అంటూ షాకయ్యారు. పైగా వెడ్డింగ్ బెల్స్.. మీ ఆశీస్సులు అందించండి అంటూ తన ఫొటోని పెట్టింది.

Pages