S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/20/2016 - 21:01

శ్రీ లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై అయాన్, కాంచన ప్రధాన తారాగణంగా ప్రసాద్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘ఇట్లు మీ సరోజ’. ఈ చిత్రానికి సంబంధించిన టాకీపార్ట్ పూర్తిచేసి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు.

05/20/2016 - 20:59

యాంకర్‌గా తక్కువ టైంలో ఎక్కువ పాపులారిటీని తెచ్చుకున్న అనసూయకు ‘జబర్దస్త్’ ప్రోగ్రాం స్టార్ ఇమేజ్‌ను తెచ్చిపెట్టింది. దాంతో మరోవైపు సినిమాల్లో కూడా అవకాశాలు క్యూకట్టాయి. నాగార్జునతో నటించిన ‘సోగ్గాడే చిన్నినాయన’, ‘క్షణం’ సినిమాలతో అనసూయ మంచి గుర్తింపే తెచ్చుకుంది. ఈ రెండు సినిమాల తరువాత ఈమెకు మరిన్ని సినిమాలు వస్తాయని అనుకున్నారందరూ. కానీ, ఇప్పటివరకూ అనసూయ ఏ సినిమాలో నటించడానికి ఒప్పుకోలేదు.

05/20/2016 - 20:57

ఉమ, రాఘవ, ప్రకాష్, శశాంక్, రాహుల్ ముఖ్యపాత్రల్లో తన్నీరు చిరంజీవి దర్శకత్వంలో జైచిరంజీవ ఆర్ట్స్ పతాకంపై కొండపల్లి పర్వతాలు సమర్పణలో సకినాన భూలక్ష్మి నిర్మించిన చిత్రం ‘లైఫ్‌కి ఫ్లాట్‌ఫాం టీనేజ్’.

05/20/2016 - 20:53

‘ఇద్దరమ్మాయిలు’ చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన గ్లామర్ భామ కాథరీన్‌కు ఆ తరువాత రెండు మూడు చిత్రాల్లో నటించినా కూడా తెలుగులో ఆశించిన గుర్తింపు దక్కలేదు. తాజాగా ‘సరైనోడు’ చిత్రంలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమెకు ఇప్పుడు మెగా ఛాన్స్ దక్కింది. చిరంజీవి హీరోగా నటించే 150వ సినిమాలో ఓ హీరోయిన్‌గా ఎంపికైందని తెలిసింది.

05/19/2016 - 21:09

రజనీకాంత్, రాధికా ఆప్టే ప్రధాన తారాగణంగా వి క్రియేషన్స్ పతాకంపై పా.రంజిత్ దర్శకత్వంలో కలైపులి ఎస్.్థను రూపొందిస్తున్న ‘కబాలి’ చిత్రం జూలై మొదటివారంలో విడుదలకు సిద్ధమవుతోంది.

05/19/2016 - 21:08

ముంబైలో 1960లో వరుస హత్యలకు పాల్పడిన సైకోకు సంబంధించిన కథతో అనురాగ్ కాశ్యప్ దర్శకత్వంలో రూపొందిన ‘రామన్ రాఘవ్ 2.0’ చిత్రం యూనిట్‌కు అరుదైన గౌరవం దక్కింది. కేన్స్‌లో జరుగుతున్న 69వ చిత్రోత్సవంలో ఈ చిత్రాన్ని ప్రదర్శించారు.

05/19/2016 - 21:04

యామిని, భావన, రుహిణి, వర్ష ప్రధాన తారాగణంగా సాయి గణపతి క్రియేషన్స్ పతాకంపై అంజన రామకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఓ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతోంది. పేరుపెట్టని ఈ చిత్రం గూర్చి దర్శకులు అంజనా రామకృష్ణ మాట్లాడుతూ, నలుగురమ్మాయిల ప్రధాన కథనంతో సాగే ఈ చిత్రం డిఫరెంట్ జోనర్‌లో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోందని, ఈ నలుగురు హీరోయిన్లకు జోడీగా ఓ ప్రముఖ హీరో నటించనున్నారని తెలిపారు.

05/19/2016 - 21:01

‘ఓ సినిమా వేడుకకు వచ్చినపుడు ఎంతో చెప్పాలని స్టేజీమీదకు వస్తే ‘పవర్‌స్టార్ పవర్‌స్టార్’ అని అరవడంవల్ల ఏమీ చెప్పకుండా వెళ్లిపోతున్నా. నేనేకాదు, ఎంతోమంది ఏదో చెప్పాలని వస్తే, పవన్ ఫ్యాన్స్ రూపంలోవున్నవారు అల్లరి చేయడంతో ఎవరూ ఏమీ సినిమా గురించి మాట్లాడకుండా వెళ్లిపోతున్నారు’ అని హీరో అల్లు అర్జున్ ఆవేదన వ్యక్తం చేశారు.

05/19/2016 - 20:59

విశాల్, శ్రీదివ్య జంటగా విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై ముత్తయ్య దర్శకత్వంలో రూపొందిన చిత్రాన్ని హరి వెంకటేశ్వర పతాకంపై తెలుగులో జి.హరి అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి.

05/19/2016 - 20:57

ఆది, నమితా ప్రమోద్ జంటగా శ్రీ ఐశ్వర్యలక్ష్మి మూవీస్, ఎస్‌ఆర్‌టి మూవీస్ హౌస్ పతాకాలపై వీరభద్రమ్ దర్శకత్వంలో వెంకట్ తలారి, రామూ తాళ్ళూరి రూపొందిస్తున్న చిత్రం ‘చుట్టాలబ్బాయి’. ఈ సినిమాకు సంబంధించిన కార్యక్రమాలు ముగింపు దశలో వున్నాయి.

Pages