మహాబలేశ్వరంలో నాగార్జున

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తున్న ఓం నమో వేంకటేశాయ చిత్రం షూటింగ్ మహాబలేశ్వరంలో జరుగుతోంది. ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా ఇప్పటికే సగానికిపైగా షూటింగ్ పూర్తిచేసుకుంది. మహాబలేశ్వరంలో మంచు కురుస్తుండగా అక్కడి కొండ ప్రాంతంలో నాగార్జునపై సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు నాగార్జున ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ షెడ్యూల్ తరువాత జరిగే మరో షెడ్యూల్‌తో సినిమా పూర్తవుతుందని, ఫిబ్రవరి నెలలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నాగార్జున-రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో వచ్చిన అన్నమయ్య, శ్రీరామదాసు, షిరిడీ సాయి చిత్రాల తరువాత వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అనుష్క, ప్రగ్న్యాజైస్వాల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని మహేష్‌రెడ్డి నిర్మిస్తున్నారు.