ఎంతెంతవరకు...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీవా, కాజల్ జంటగా డి.కె. దర్శకత్వంలో డి.వెంకటేష్ రూపొందిస్తున్న చిత్రం ఎంతవరకు ఈ ప్రేమ. ఈ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా నిర్మాత డి.వెంకటేష్ మాట్లాడుతూ- తమిళంలో ‘కవలైవేండామ్’ చిత్రాన్ని తెలుగులో ‘ఎంతవరకు ఈప్రేమ’ అనే టైటిల్‌తో అనువదించామని, కాజల్ అగర్వాల్ నటన, గ్లామర్ ఈ చిత్రంలో హైలెట్‌గా నిలుస్తాయని, వెనె్నలకంటి అందించిన మాటలు, పాటలు, డబ్బింగ్‌కు అనుగుణంగా వచ్చాయని తెలిపారు. జీవా, కాజల్‌తో చిత్రీకరించిన ప్రతిపాటా పొయిటిక్ సన్నివేశాలతో ఆహ్లాదకరంగా వుంటాయని, లియోన్ జేమ్స్ అందించిన పాటలు ఇప్పటికే తమ యూనిట్‌కు నచ్చాయని ఆయన తెలిపారు. మనసుకు హత్తుకునే ప్రేమకథనంతో యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నామని, త్వరలో ఆడియో విడుదల చేసి వచ్చే నెల మొదటివారంలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు జరుపుతున్నామని ఆయన తెలిపారు.