నవ్వించే మిక్చర్ పొట్లం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జయంత్, శే్వతాబసు ప్రసాద్ జంటగా సతీష్‌కుమార్.ఎం.వి. దర్శకత్వంలో గోదావరి సినీ టోన్ పతాకంపై లక్ష్మీప్రసాద్, వీరన్నచౌదరి, లంకపల్లి శ్రీనివాసరావు నిర్మిస్తున్న చిత్రం ‘మిక్చర్ పొట్లం’. షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం త్వరలోనే విడుదలకు సిద్ధమవుతున్న సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాత లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ,‘మా బ్యానర్‌లో తొలి చిత్రం ఇది. పూర్తి కామెడీ జోనర్‌లో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ప్రేక్షకులకు ఎమోషనల్‌గా కనెక్టయ్యే అంశాలుంటాయి. దాంతోపాటు చిన్న సందేశాన్ని కూడా అందిస్తున్నాం. చాలా గ్యాప్ తరువాత శే్వతబసు నటిస్తున్న చిత్రమిది. అందరి సహకారంతో షూటింగ్ పూర్తిచేశాం. త్వరలోనే పాటలను విడుదల చేసి డిసెంబర్‌లో చిత్రాన్ని విడుదల చేస్తామని’ అన్నారు. హీరోయిన్ శే్వత బసు మాట్లాడుతూ- ‘కొత్తబంగారులోకం, రైడ్ తరువాత మంచి సినిమా చేస్తున్నా. ఇందులో సువర్ణసుందరి పాత్రలో ఓ సెలబ్రిటీగా కనిపిస్తా. ఇది రెగ్యులర్ రొమాంటిక్ సినిమా కాదు. సమాజంలో మనుషులు ఎలా వుంటారు? వాళ్ళ వ్యక్తిత్వాలు, ఆలోచనా విధానం- అన్నీ అంశాలను హైలెట్‌గా తీసుకుని సమాజానికి సందేశాన్నిచ్చే చిత్రమిది. ఇక చదువుకుంటున్న సమయంలోనే సినిమాల్లోకి వచ్చాను. ప్రస్తుతం గ్రాడ్యుయేషన్ పూర్తిచేసే పనిలో వున్నాను. మాస్ జర్నలిజం కూడా చేశాను. దాంతోపాటు బాలీవుడ్‌లో మక్‌దే, ఇక్బాల్ సినిమా అవకాశాలు వచ్చాయి. ఏక్తాకపూర్ నిర్మిస్తున్న టీవీ సీరియల్‌లోనూ నటిస్తున్నాను. ప్రస్తుతం కరణ్ జోహార్ బ్యానర్‌లో బద్రినాధ్‌కి దుల్హానియా చిత్రంలో చేస్తున్నాను. దాంతోపాటు షార్ట్ఫిలింను నిర్మిస్తున్నాను’ అన్నారు. దర్శకుడు సతీష్ కుమార్ మాట్లాడుతూ- ‘ఇది బస్ జర్నీ నేపథ్యంలో సాగే సినిమా. అమలాపురం నుంచి షిరిడీ వెళ్ళే బస్సులో జరిగే కథ. ప్రయాణంలో భిన్నమైన వ్యక్తులు పరిచయమైతే ఎలా వుంటుంది అనేదే కథ’ అని వివరించారు.