S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

01/06/2016 - 11:42

విజయవాడ: కల్తీ మద్యం కేసులో తొమ్మిదో నిందితుడిగా ఉన్న కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కొద్దిరోజుల అజ్ఞాతం అనంతరం బుధవారం ఉదయం సిట్ (ప్రత్యేక విచారణ బృందం) ఎదుట హాజరయ్యారు. విజయవాడలోని స్వర్ణ బార్ అండ్ రెస్టారెంట్‌లో కల్తీ మద్యం కారణంగా ఇటీవల ఐదుగురు మృత్యువాత పడిన కేసులో విష్ణు నిందితుడు. ముందస్తు బెయిల్‌కు కోర్టు నిరాకరించడంతో ఆయన ఈ రోజు విచారణకు హాజరయ్యారు.

01/06/2016 - 11:42

కాకినాడ: గోకవరం మండలం కొత్తపల్లి వద్ద బుధవారం ఉదయం ఇసుక ట్రాక్టర్ ఢీకొనడంతో బైక్ వెనుక కూర్చున్న వెంకటేశ్ అనే 12 ఏళ్ల విద్యార్థి అక్కడికక్కడే మరణించాడు. క్రిస్మస్ సెలవులకు ఇంటికి వెళ్లి తిరిగి గోకవరంలోని హాస్టల్‌కు వస్తుండగా ఇసుక ట్రాక్టర్ ఢీకొంది.

01/06/2016 - 11:41

కర్నూలు: ఎ.పి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు. నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో నిర్మించిన మాతా శిశు భవనాన్ని ఆయన ప్రారంభించారు. దీబగుంట్ల తదితర గ్రామాల్లో జన్మభూమి సభల్లో ఆయన పాల్గొంటారు. ఈ రోజు రాత్రికి ఆయన కర్నూలు జిల్లాలోనే బస చేస్తారు.

01/06/2016 - 11:40

శ్రీకాకుళం: ఎల్.ఎన్.పేట మండలం గొట్టిపల్లి వద్ద మంగళవారం అర్ధరాత్రి ఏనుగులు పంట పొలాలపై విరుచుకుపడి కుప్పలుగా పోసిన ధాన్యాన్ని చెల్లాచెదరు చేశాయి. ఏనుగుల తాకిడితో గ్రామస్థులు ఒక్కసారి ఆందోళనకు లోనయ్యారు. ఈ ఘటనపై అటవీ శాఖ అధికారులకు సమాచారం అందజేశారు.

01/06/2016 - 11:39

విశాఖ: విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాడని ఆగ్రహించి జి.కె.వీధి మండలం జెర్రెల గ్రామంలో మాజీ సర్పంచ్ ఎస్.వెంకట రమణను మావోయిస్టులు మంగళవారం అర్ధరాత్రి కాల్చి చంపారు. ప్రజలకు వ్యతిరేకంగా ఉంటున్నందునే ఈ హత్య చేశామని మావోలు గ్రామస్థులకు సమాచారం పంపారు.

01/05/2016 - 11:47

కాకినాడ: సహచర విద్యార్థులు సూటి పోటి మాటలతో వేధించడంతో మనస్తాపం చెందిన శంకర్ రెడ్డి అనే 9వ తరగతి విద్యార్థి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. తూ.గో.జిల్లా మారేడువిల్లి గురుకుల పాఠశాలలో మంగళవారం ఉదయం విద్యార్థి మృతదేహాన్ని కనుగొన్నారు. మృతదేహం వద్ద లభించిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

01/05/2016 - 11:46

హైదరాబాద్: ‘చంద్రన్న సంక్రాంతి కానుక’లో పేదవర్గాలకు ఇస్తున్న సరకుల్లో నాణ్యతా లోపం ఉంటే సహించేది లేదని ఎ.పి. సి.ఎం. చంద్రబాబు అధికారులను హెచ్చరించారు. ఆయన మంగళవారం ఉదయం కలెక్టర్లు, అధికారులు, పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఒకేసారి 8 వేల మందితో జరిగిన టెలీకాన్ఫరెన్స్‌లో ఆయన జన్మభూమి సమావేశాల తీరుపై వివరాలు తెలుసుకున్నారు.

01/05/2016 - 11:45

విశాఖ: చలి తీవ్రత పెరిగి ఉదయం 10 గంటల వరకు మంచు మేఘాలు కమ్ముకోవడంతో విశాఖ మన్యం కొత్త అందాలను సంతరించుకుంది. ఈ ప్రకృతి దృశ్యాలను వీక్షించేందుకు పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తున్నారు. లంబసింగి, బొర్రాగుహలు, కొత్తపల్లి వాటర్ ఫాల్స్ తదితర ప్రాంతాలను సందర్శించేందుకు చలిని సైతం లెక్కచేయకుండా పర్యాటకులు వస్తున్నారు. మంగళవారం ఉదయం లంబసింగిలో 7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.

01/04/2016 - 16:45

విజయవాడ :కల్తీ మద్యం కేసులో మల్లాది విష్ణు పెట్టుకున్న బెయిల్ పిటషన్‌ను విజయవాడ మెట్రోపాలిటిన్ కోర్టు కొట్టివేసింది. ఎల్లుండి లోపు విచారణ అధికారి ఎదుట హాజరుకావాలని ఆదేశించింది.

01/04/2016 - 16:44

తిరుపతి : ప్రముఖ గాయని ఎం.ఎస్.సుబ్బలక్ష్మి శతజయంతి ఉత్సవాలు నేటి నుంచి మూడు రోజుల పాటు తిరుపతిలో జరుగనున్నాయి. మహతి ఆడిటోరియంలో ఎం.ఎస్.సుబ్బలక్ష్మి మునిమనువరాలు ఐశ్వర్య గాత్ర కచేరీతో ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. ఈ సందర్భంగా టీటీడీ ఏర్పాటు చేసిన సుబ్బలక్ష్మి విగ్రహానికి ఐశ్వర్య నివాళలర్పించారు.

Pages