S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

01/11/2016 - 17:47

తణుకు : చట్టసభలు విమర్శలకు వేదికలవుతున్నాయని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖామంత్రి వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తంచేశారు. సోమవారం ఆయన పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ముళ్లపూడి హరిశ్చంద్రప్రసాద్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో వెంకయ్యనాయుడు మాట్లాడుతూ సభ జరిగే సమయం కంటే వాయిదా సమయమే ఎక్కువవుతోందని తెలిపారు.

01/11/2016 - 11:53

గుంటూరు: చేతబడి చేసి కొందరి మరణాలకు కారకుడయ్యాడన్న అనుమానంతో ఓ వ్యక్తిని గ్రామస్థులు రాళ్లు, కర్రలతో కొట్టి హతమార్చారు. గురజాల మండలం గోగులపాడులో సోమవారం ఉదయం ఈ ఘటన వెలుగుచూసింది. సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

01/11/2016 - 11:52

కడప: ఖాజీపేట మండలం దుంపలగట్టు వద్ద సోమవారం ఉదయం అదుపుతప్పిన ట్రాక్టర్ రోడ్డుపక్క పూల వ్యాపారులపై దూసుకెళ్లింది. ఓ వ్యాపారి అక్కడికక్కడే మరణించగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

01/11/2016 - 11:52

గుంటూరు: తాడేపల్లి మహానాడు కాలనీలో సోమవారం ఉదయం వేగంగా వస్తున్న ఓ ట్రాక్టర్ అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకుపోగా, మహిళ మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు.

01/11/2016 - 11:51

విశాఖ: రాష్ట్ర విభజన అనంతరం పలు సమస్యలను ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపేందుకు కేంద్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని కేంద్ర మంత్రి వెంకయ్య హామీ ఇచ్చారు. విశాఖలో భాగస్వామ్య సదస్సు సందర్భంగా సోమవారం ఆయన మాట్లాడుతూ ఎ.పి.కి ఇప్పటికే 1.93 లక్షల ఇళ్లను మంజూరు చేశామన్నారు. 28 పట్టణాలను అమృత్ కింద, ఒక పట్టణాన్ని వారసత్వ నగరంగా గుర్తించామన్నారు.

01/11/2016 - 11:51

అనంతపురం: పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో అటెండర్‌గా పని చేస్తున్న మహిళపై అత్యాచార యత్నం జరిగినట్లు సోమవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ ఘటనలో నిందితులైన ఇద్దరు యువకులను అరెస్టు చేసి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

01/11/2016 - 11:50

కాకినాడ: సంక్రాంతి సందర్భంగా నిత్యావసర సరకులను పేదలకు చంద్రన్న కానుక రూపంలో అందజేయాలన్న ఎ.పి. ప్రభుత్వ ఆలోచనకు ఆదిలోనే గండిపడింది. తూర్పుగోదావరి జిల్లాలో రేషన్ దుకాణాల వద్ద ఈ కానుకల కోసం జనం పగలు రాత్రీ పడిగాపులు కాస్తున్నారు. పౌర సరఫరాల శాఖలో సర్వర్లు పనిచేయని కారణంగా చంద్రన్న కానుక పంపిణీలో ఆలస్యం జరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.

01/11/2016 - 11:50

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు సానుకూల పరిస్థితులు ఉన్నాయని, త్వరలోనే ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందంజలో నిలవటం ఖాయమని జిఎంఆర్ సంస్థల అధినేత గ్రంథి మల్లికార్జునరావు అన్నారు. విశాఖలో భాగస్వామ్య సదస్సు రెండో రోజు కార్యక్రమంలో సోమవారం ఆయన మాట్లాడుతూ 2029 నాటికి రాష్ట్రాన్ని దేశంలోనే ప్రథమ స్థానంలో నిలపాలని సి.ఎం. చంద్రబాబు కృషి చేస్తున్నారని కొనియాడారు

01/09/2016 - 16:35

తణుకు: ఏడాదిలోగా పోలవరం ఎడమ కాలువ పనులు పూర్తి చేసి విశాఖకు తాగునీరు ఇస్తామని ఆంధ్రప్రదేశ్‌ భారీ నీటిపారుదలశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. శనివారం పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ‘జన్మభూమి-మావూరు’ కార్యక్రమంలో మంత్రి అయ్యన్నపాత్రుడుతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ.. ఏటా 5వేల కి.మీ.

01/09/2016 - 16:18

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈనెల 19 నుంచి 24 వరకు దావోస్‌లో చంద్రబాబు పర్యటించనున్నారు. చంద్రబాబు వెంట మొత్తం 9 మంది సభ్యుల బృందం దావోస్ వెళ్లనున్నారు. బృందంలో మంత్రి యనమల, పరకాల సహా ఉన్నతాధికారులు ఉన్నారు.

Pages