S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

01/13/2016 - 12:01

హైదరాబాద్: ఎ.పి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును బుధవారం ఆయన నివాసంలో తెలంగాణ మంత్రులు కడియం శ్రీహరి, చందూలాల్ సమావేశమయ్యారు. వరంగల్ జిల్లాలో మూతపడిన రేయాన్ పరిశ్రమను తిరిగి తెరిచేలా సహకరించాలని ఈ సందర్భంగా వారు చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణలోని రేయాన్ పరిశ్రమకు అవసరమైన ముడిసరకు ఎపి నుంచి సరఫరా కావాల్సిఉంది.

01/12/2016 - 14:07

విశాఖ: విశాఖలో జరుగుతున్న భాగస్వామ్య సదస్సు చివరిరోజున ఆయన పారిశ్రామికవేత్తలతో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పర్యాటక రంగంలో వివిధ సంస్థలతో రూ.7,840 విలువైన 27 అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు తెలిపారు. భాగస్వామ్య సదస్సులో పర్యాటక రంగంలో ఇవాళ రూ. 4,659 కోట్లతో 26 ఒప్పందాలు చేసుకున్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు.

01/12/2016 - 12:08

నెల్లూరు: కలపర్తిపాడు వద్ద మంగళవారం ఉదయం వేగంగా వస్తున్న లారీ ఓ వ్యాన్‌ను ఢీకొనటంతో ఇద్దరు మరణించగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రకాశం జిల్లా కందుకూరుకు చెందిన వీరంతా వ్యాన్‌లో తిరుపతికి వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది.

01/12/2016 - 12:08

నెల్లూరు: భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఆమె గొంతు కోసి పరారయ్యాడు. నగరంలోని పొదలకూరు రోడ్డులో మంగళవారం ఉదయం ఈ సంఘటన జరిగింది. గాయపడిన భార్య పుష్పలత (22)ను ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉంది.

01/12/2016 - 12:07

అనంతపురం: కుటుంబ కలహాల ఫలితంగా మెడిసిన్ చదువుతున్న మీనాక్షి అనే యువతి సోమవారం అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు శ్రీనివాస్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే భర్త శ్రీనివాస్ మరో యువతితో సంబంధం పెట్టుకున్నట్లు అనుమానం రావడంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. భర్త ప్రవర్తనకు మనస్తాపం చెంది మీనాక్షి ఆత్మహత్యకు చేసుకున్నట్లు బంధువులు చెబుతున్నారు.

01/12/2016 - 12:07

విశాఖ: విశాఖ ఏజెన్సీలో దట్టమైన పొగ మంచు ఆవరించటంతో ప్రకృతి మరింత అందాలు సంతరించుకుంది. ఉదయం 10 గంటల వరకు పొగ కమ్మేయటంతో వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. లంబసింగిలో 5, చింతపల్లిలో 8, పాడేరులో 9 కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ప్రకృతి అందాలను చూసేందుకు పలు ప్రాంతాల నుంచి పర్యాటకులు తరలి వస్తున్నారు.

01/12/2016 - 12:06

విశాఖ: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ మంగళవారం ఉదయం సింహాచలం పుణ్యక్షేత్రాన్ని సందర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. గవర్నర్‌కు పురోహితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. పలువురు మంత్రులు, అధికారులు గవర్నర్ వెంట ఉన్నారు.

01/12/2016 - 12:05

హైదరాబాద్: సంక్రాంతి సందర్భంగా ప్రయాణీకుల రద్దీని తట్టుకునేందుకు ఎ.పి.ఎస్. ఆర్టీసీ 2600 ప్రత్యేక బస్సులను నడుపుతుందని రవాణా శాఖ మంత్రి సిద్ద రాఘవరావు చెప్పారు. రద్దీ దృష్ట్యా అధిక చార్జీలు వసూలు చేసే ప్రైవేటు ట్రావెల్స్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఒక్క హైదరాబాద్ నుంచే రోజుకు 600 ప్రత్యేక బస్సులు నడుపుతామన్నారు.

01/12/2016 - 12:05

విశాఖ: జీవితంలో అనుకున్నది సాధించి నిజమైన ఆనందం పొందాలంటే వివేకానందుని మార్గం నేటి యువతకు శరణ్యమని ఎ.పి. సి.ఎం. చంద్రబాబు అన్నారు. విశాఖ ఎ.యు. కాన్వొకేషన్ హాలులో మంగళవారం ఉదయం వివేకానందుని జయంతి సందర్భంగా జాతీయ యువజన దినోత్సవంలో ఆయన ప్రసంగించారు. మన దేశంలో ఉన్న యువశక్తి ప్రపంచంలో ఎక్కడా లేదన్నారు.

01/12/2016 - 12:04

గుంటూరు: గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో మంగళవారం ఉదయం ఓ ఉన్మాది వీరంగం సృష్టించి ఓ మహిళపై అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ సందర్భంగా ఎమర్జెన్సీ వార్డులో ముగ్గురిపై సెలైన్ స్టాండ్‌తో దాడిచేసి చితకబాదాడు. చివరకు రోగుల బంధువులు, ఆస్పత్రి సిబ్బంది ఉన్మాదిని పట్టుకుని, ఆటోకి కట్టేసి దేహశుద్ధి చేశారు. గాయపడిన ముగ్గురు సిబ్బందికి చికిత్స అందిస్తున్నారు.

Pages