S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

01/09/2016 - 11:59

విజయవాడ: గుడివాడలో జాతీయ స్థాయి గ్రామీణ క్రీడా పోటీలను కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు శనివారం ఉదయం ప్రారంభించారు. క్రీడల వల్ల విద్యార్థులకు శారీరక, మానసిక ఆరోగ్యం లభిస్తుందని ఆయన అన్నారు. ఈ నెల 12 వరకు జరిగే ఈ పోటీల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన జట్లు పాల్గొంటాయి.

01/09/2016 - 11:58

కర్నూలు: డోన్ మండలం కొత్తకోట వద్ద శనివారం ఉదయం అయ్యప్ప భక్తులతో వెళ్తున్న ఓ కారు అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో ఒకరు మరణించగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా హైదరాబాద్ నుంచి శబరిమలకు కారులో బయల్దేరారు.

01/09/2016 - 11:58

అనంతపురం: మద్యం మత్తులో ఉన్న కుమారుడి చేతిలో ఓ తండ్రి ప్రాణాలు కోల్పోయిన ఘటన అనంతపురం జిల్లా బత్తలపల్లిలో శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. సంజీవ్ అనే వ్యక్తి మద్యం సేవించి గ్రామంలో గొడవ చేస్తుండగా కుటుంబ సభ్యులు అతనిని వారించారు. తండ్రి రామాంజనేయులు కూడా ఘర్షణ వద్దని కొడుక్కి నచ్చజెప్పాడు. దీంతో ఆగ్రహంతో రగిలిపోయిన సంజీవ్ తన తండ్రి తలపై కర్రతో బలంగా కొట్టాడు.

01/08/2016 - 15:58

భీమవరం : పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో విషాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న చర్చి కూలి 11 మంది గాయపడ్డారు. శుక్రవారం చర్చి శ్లాబ్‌ వేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రుల్లో నలుగురి పరిస్థితి విషమం.

01/08/2016 - 14:07

విజయవాడ : కొత్త రాజధాని నిర్మాణంలో ఎన్నో సవాళ్లున్నాయని,సింగిల్‌ విండో పద్ధతిలో త్వరితగతిన అన్ని అనుమతులు మంజూరుచేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడలోని ఏ1 కన్వెన్షన్‌ సెంటర్‌లో క్రెడాయ్‌ విజయవాడ విభాగం ఏర్పాటు చేసిన స్థిరాస్తి ప్రదర్శనను సీఎం ప్రారంభించారు.

01/08/2016 - 13:46

శ్రీకాకుళం : జిల్లాలో శుక్రవారంనాడు మధ్యాహ్నం 12.30 గంటల మధ్య మళ్లీ భూప్రకంపనలు సంభవించాయి. పొందూరు మండలంలోని పుల్లాజీపేట, లొలుగ, దెల్లిపేట, కృష్ణాపురం తదితర గ్రామాల్లో మూడు సెకన్ల పాటు భూమి కంపించింది. ప్రజలు ఇళ్ల నుంచి పరుగులు తీశారు.

01/08/2016 - 13:41

విజయవాడ : విజయవాడలోని మొగల్రాజపురంలో విషాదం నెలకొన్నది. విద్యుత్ స్థంభాలు ఎక్కి పనిచేస్తుండగా విద్యుత్ సరఫరా అయి ఇద్దరు కార్మికులు మృతిచెందారు. అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

01/08/2016 - 11:56

విజయవాడ: ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాల అమలులో పారదర్శకత ఉండేలా వ్యవహరించాలని ఎ.పి. సి.ఎం. చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఆయన శుక్రవారం ఉదయం వివిధ శాఖల అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి జన్మభూమి, మా ఊరు తదితర పథకాల అమలు తీరును సమీక్షించారు. పదవి సంతృప్తిగా ఉండాలన్నదే అంతిమ లక్ష్యంగా భావించి పని చేయాలని ఆయన పేర్కొన్నారు.

01/08/2016 - 11:52

చిత్తూరు: పుత్తూరు మండలంలో అటవీ శాఖ చెక్‌పోస్టు వద్ద శుక్రవారం ఉదయం పోలీసులు తనిఖీలు నిర్వహించి ఓ వ్యాన్‌లో తరలిస్తున్న 20 ఎర్రచందనం దుంగలను పట్టుకున్నారు. పోలీసుల రాకను గమనించి నిందితులు వ్యాన్ వదిలేసి పరారయ్యారు.

01/07/2016 - 12:12

ఏలూరు: ఉంగుటూరు మండలం కైకరం గ్రామం వద్ద గురువారం ఉదయం రోడ్డుపై ఆగి ఉన్న లారీని ఓ జీపు ఢీకొనడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. గాయపడిన మరో వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు.

Pages