S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

01/02/2016 - 11:55

విజయవాడ: ఎ.పి. ప్రభుత్వం పది రోజులపాటు నిర్వహించే మూడో విడత ‘జన్మభూమి- మీ ఊరు’ కార్యక్రమానికి శనివారం శ్రీకారం చుట్టింది. సిఎం చంద్రబాబు ఈ రోజు విజయనగరం, విశాఖ జిల్లాలలో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొని లబ్ధిదారులతో భేటీ అవుతారు. అనంతరం ఆయన విశాఖ ఉత్సవ్ ముగింపు కార్యక్రమంలో పాల్గొంటారు. 4 నుంచి 12వ తేదీ వరకు పలు జిల్లాల్లో ఆయన పర్యటిస్తారు.

01/01/2016 - 16:16

ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని సెంట్రల్ ఆసుపత్రిలో తల్లి బిడ్డల పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఏర్పాటుచేసిన తల్లిబిడ్డల ప్రత్యేక విభాగాన్నిసీఎం ప్రారంభించారు. అలాగే 102 కాల్ సెంటర్, ఎన్టీఆర్‌ వైద్య పరీక్ష, టెలీ రేడియాలజీ పథకాలను కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించించారు.

01/01/2016 - 16:13

విజయవాడ: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మభూమి పర్యటన షెడ్యూల్‌ ఖరారైంది. రేపు విజయనగరం జిల్లాలో మూడవ విడత జన్మభూమి కార్యక్రమాన్ని చంద్రబాబు ప్రారంభించనున్నారు.

01/01/2016 - 16:04

విజయవాడ : విజయవాడలోని ముఖ్యమంత్రి కార్యాలయం జనసందోహంగా మారింది. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు శుభాకాంక్షలు చెప్పేందుకు ప్రజలు, అధికారులు బారులు తీరారు.

01/01/2016 - 15:45

గుంటూరు : ఏఎన్‌యూలో ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థిని రిషితేశ్వరి కేసులో పోలీసులు చార్జిషీటు దాఖలు చేశారు. ప్రిన్సిపాల్ బాబూరావును నాలుగో నిందితుడిగా చేర్చారు. దీంతో ప్రిన్సిపాల్‌ బాబూరావును పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే హనీషా, జైచరణ్, శ్రీనివాస్ అనే నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే.

01/01/2016 - 08:11

ఫోర్జరీ సంతకాలతో సర్ట్ఫికెట్లు తయారీ * బద్వేలులో నలుగురికి అరదండాలు

01/01/2016 - 08:10

సిఎం చంద్రబాబు నూతన సంవత్సర శుభాకాంక్షలు

12/31/2015 - 16:37

విజయవాడ : ఆర్టీసీలో మౌలిక వసతులను ఏర్పాటుచేసేందుకు కార్పోరేషన్‌ను ఏర్పాటుచేస్తున్నట్లు ఏపీ ఆర్టీసీ ఎండీ సాంబశివరావు తెలిపారు. ఆయన విజయవాడలో మాట్లాడుతూ ఆర్టీసీ స్థలాలను వాణిజ్య అవసరాల కోసం వినియోగిస్తామని తెలిపారు. సంక్రాంతికి 15 లగ్జరీ బస్సులను ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు.

12/31/2015 - 16:36

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌లో సెట్‌టాప్‌ బాక్సుల ఏర్పాటుకు గడువు పెంచుతూ హైకోర్టు ఈరోజు ఆదేశాలిచ్చింది. కేబుల్‌ ప్రసారాల డిజిటలైజేషన్‌కు కేంద్రం విధించిన గడువును హైకోర్టు మరో రెండు నెలలు పొడిగించింది. ఏపీ ఎంఎస్‌వోల వాదనతో ఏకీభవించిన హైకోర్టు రెండు నెలల పాటు యథాతథస్థితి కొనసాగిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.

12/31/2015 - 16:32

విజయవాడ : 2014తో పోలిస్తే ఈ ఏడు నేరాల సంఖ్య 4.23 శాతం తగ్గిందని డీజీపీ రాముడు విశ్లేషించారు. గురువారం విజయవాడలో ఈ ఏడాది రాష్ట్రంలో జరిగిన నేరాల సంఖ్యపై జేవీ రాముడు మాట్లాడారు. ఈ ఏడాది 100 మంది మావోయిస్టులు లొంగిపోయారని చెప్పారు. మరో 96 మంది మావోయిస్టులను అరెస్ట్ చేశామని పేర్కొన్నారు.

Pages