S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

12/29/2015 - 11:37

అనంతపురం: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్, ఎ.పి. సి.ఎం. చంద్రబాబు మంగళవారం ఉదయం పుట్టపర్తి చేరుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నీరు - ప్రగతి కార్యక్రమంలో వీరు పాల్గొంటున్నారు.

12/29/2015 - 11:37

కడప: కడప సెంట్రల్ జైలు నుంచి నలుగురు ఖైదీలు పరారు కావటంపై ఎ.పి. హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పరారైన ఖైదీలను పట్టుకోవాలని ఆయన ఉన్నతాధికారులను ఆదేశించారు. దీంతో ఖైదీలను పట్టుకొనేందుకు ప్రత్యేక బృందాలు అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు ప్రారంభించాయి.

12/29/2015 - 11:36

విశాఖ: విశాఖ ఏజెన్సీలో చలి తీవ్రత అంతకంతకు పెరుగుతోంది. ఉదయం పది గంటలైనా మంచు కురుస్తున్నందున ఏజెన్సీ వాసులు ఇళ్ల నుంచి బయటికి వచ్చేందుకు జంకుతున్నారు. రహదారులపై వాహనాలు తిరగడం లేదు. మంగళవారం ఉదయం లంబసింగి, మినుములూరు 8, చింతపల్లి, పాడేరులో 10 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

12/29/2015 - 11:36

విశాఖ: దేవరాపల్లి - పినకోట మార్గంలో మంగళవారం ఉదయం అటవీ శాఖ అధికారులు విస్తృతంగా గాలింపు చేపట్టి ఓ కారులో తరలిస్తున్న 150 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మహరాష్టక్రు చెందిన నలుగురు నిందితులను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.

12/29/2015 - 07:43

నెల్లూరు, డిసెంబర్ 28: కాంగ్రెస్ పార్టీ 131వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సోమవారం నెల్లూరులోని ఇందిరాభవన్‌లో పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ స్థాపించి 131 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కేక్‌ను కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.

12/29/2015 - 07:43

రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల వెల్లడి

12/29/2015 - 07:41

మాజీ ఎమ్మెల్యేలతో మాజీ సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి

12/28/2015 - 18:36

హైదరాబాద్‌: తూర్పుగోదావరి జిల్లా చింతూరు ఏజెన్సీలో ప్రాంతంలో సోమవారం ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో శబరి ఏరియా కమిటీ కమాండర్‌ గణేశ్‌ మృతి చెందాడు. గణేశ్‌ మృతిని ఎస్పీ రవిప్రకాశ్‌ ధ్రువీకరించారు.

12/28/2015 - 14:08

రాజవొమ్మంగి: తూర్పుగోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలం అమీనాబాద్ కాలనీలోని గిరిజన బాలిక ఆశ్రమ పాఠశాల విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. సోమవారం ఉదయం తీవ్ర కడుపునొప్పితో బాధపడుతున్న నలుగురు విద్యార్థినులను పాఠశాల సిబ్బంది రాజవొమ్మంగి ఆస్పత్రిలో చేర్పించారు. రెండు రోజుల క్రితం ఇలాంటి లక్షణాలతోనే 7వ తరగతి విద్యార్థిని దుర్గాజ్యోతి (13) మృతి చెందింది.

12/28/2015 - 13:51

కర్నూలు : అర్హులైనవారందరికీ చంద్రన్న కానుకను అందజేస్తామని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత తెలిపారు. ఆమె సోమవారంనాడు కర్నూలులో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈపాస్ విధానంతో బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తామని వెల్లడించారు.

Pages