S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

12/27/2015 - 06:58

మడకశిర, డిసెంబర్ 26: అనంతపురం జిల్లా మడకశిర మండలంలోని భక్తరహళ్లి లక్ష్మీనరసింహస్వామి, జిల్లేడుకుంట ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం భూతప్పల ఉత్సవం కన్నులపండువగా జరిగింది. భూతప్పలు భక్తులపై నుంచి నడుచుకుంటూ వెళ్లే దృశ్యాన్ని తిలకించేందుకు జనం భారీగా తరలివచ్చారు. భూతప్ప విగ్రహాన్ని చేతపట్టుకున్న వారి కాలిస్పర్శ తగిలితే కోర్కెలు తీరుతాయని భక్తుల నమ్మకం.

12/27/2015 - 06:58

శ్రీశైలం, డిసెంబర్ 26: శ్రీశైలంలో కొలువైన శ్రీ మల్లికార్జునస్వామి వారికి ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని శనివారం వార్షిక ఆరుద్ర ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈఉత్సవాన్ని ప్రతి నెల మాసోత్సవంగా నిర్వహిస్తుంటారు. ధనుర్మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం రోజున వార్షిక ఆరుద్ర ఉత్సవాన్ని జరిపించడం సంప్రదాయంగా వస్తోంది.

12/27/2015 - 06:57

కడప, డిసెంబర్ 26: వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి శనివారం జిల్లాలోని జమ్మలమడుగు నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన జరిపారు. పలువురిని పరామర్శించారు. మరికొందరిని ఓదార్చారు. జమ్మలమడుగులో వైసిపి నేత మునిరెడ్డి కుమారుడు, కోడలిని ఆశీర్వదించేందుకు వెళ్లగా అక్కడే ఎమ్మెల్సీ నారాయణరెడ్డి, మరికొంతమంది తెలుగుదేశం నాయకులు తారసపడ్డారు. అయితే ఎలాంటి పలకరింపులు లేకుండా ఎవరికి వారు మిన్నకుండిపోవడం గమనార్హం.

12/27/2015 - 06:56

రాయలసీమ జోన్ ఐజి గోపాలకృష్ణ స్పష్టీకరణ

12/26/2015 - 22:39

* నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ
గుంటూరు: 2016 సంవత్సరంలోనే పోలవరం కుడి కాలువ పూర్తి చేస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. గుంటూరులో శనివారం ఆయన విలేఖర్లతో మాట్లాడారు.

12/26/2015 - 22:38

విజయవాడ: రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ వ్యవస్థాపక దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పార్టీ పతాకాలను ఎగుర వేసి పార్టీ కోసం ప్రాణాలర్పించిన వారికి నివాళులర్పించారు.

12/26/2015 - 22:38

* వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి
విజయవాడ: వచ్చే జూన్ మాసాంతానికి హైదరాబాద్ నుండి సచివాలయం తరలింపు తథ్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అధికారులతో శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు.

12/26/2015 - 22:38

కూచిపూడి: కృష్ణా జిల్లా పమిడిముక్కలలో శనివారం సంభవించిన అగ్ని ప్రమాదంలో 17 ఇళ్లు దగ్ధమయ్యాయి. విద్యుత్‌షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం సంభవించినట్టు తెలిసింది.

12/26/2015 - 22:37

మచిలీపట్నం: కృష్ణా జిల్లా అవనిగడ్డకు చెందిన ఓ కుటుంబంలోని నలుగురు రోడ్డు ప్రమాదంలో మరణించారు. కర్నాటక రాష్ట్రం బీదర్‌లో శనివారం జరిగిన ప్రమాదంలో వారు ప్రాణాలు కోల్పోయారు.

Pages