ఆంధ్రప్రదేశ్‌

ఘనంగా ఆరుద్ర ఉత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం, డిసెంబర్ 26: శ్రీశైలంలో కొలువైన శ్రీ మల్లికార్జునస్వామి వారికి ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని శనివారం వార్షిక ఆరుద్ర ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈఉత్సవాన్ని ప్రతి నెల మాసోత్సవంగా నిర్వహిస్తుంటారు. ధనుర్మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం రోజున వార్షిక ఆరుద్ర ఉత్సవాన్ని జరిపించడం సంప్రదాయంగా వస్తోంది. ఉత్సవాన్ని పురస్కరించుకుని రాత్రి స్వామివారికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, అన్నాభిషేకం జరిపించారు. శనివారం తెల్లవారుజామున ప్రాతఃకాల పూజ నిర్వహించారు. ఉత్తర ద్వారం వద్ద స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజాదికాలు నిర్వహించిన అనంతరం ఉత్సవమూర్తులను నందివాహనంపై ఆశీనులను జేసి గ్రామోత్సవం నిర్వహించారు. అరుద్ర ఉత్సవాన్ని పురస్కరించుకుని ఆలయ వేళల్లో మార్పులు చేశారు. భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చిన స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు.