S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

12/26/2015 - 22:36

జ్యూట్ మిల్లు కార్మికుల పరిస్థితి దినదిన గండం నూరేళ్ల ఆయుష్షు చందంగా మారింది. మిల్లులు ఎప్పుడు తెరుస్తారో.. ఎప్పుడు మూస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. ఉత్తరాంధ్రలో ఎక్కువ మంది కార్మికులు జ్యూట్ మిల్లులపై ఆధారపడి ఉన్నారు. ఇప్పటికే విజయనగరం జిల్లాలో రెండు మిల్లులు మూతపడగా, విశాఖ జిల్లా తగరపువలస మిల్లులో పనిచేస్తున్న కార్మికులకు బకాయిలు చెల్లించాల్సి ఉంది.

12/26/2015 - 22:36

* తగ్గుతున్న పగటి ఉష్ణోగ్రతలు
విశాఖ: ఉత్తర ఈశాన్య దిశగా సముద్రం నుంచి వీస్తున్న గాలులతో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. గత రెండు రోజులుగా వీస్తున్న చలిగాలులకు ఇదే కారణమని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. మరో వారం రోజుల పాటు చలిగాలులు తప్పదు.

12/26/2015 - 22:36

అనారోగ్యంతో శుక్రవారం హైదరాబాద్ నిమ్స్‌లో కన్నుమూసిన మాజీ మంత్రి మెట్ల సత్యనారాయణరావు అంత్యక్రియలు శనివారం తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో అధికార లాంఛనాలతో నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు లోకేష్, ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తదితరులు హాజరై మెట్లకు నివాళులర్పించారు.

12/26/2015 - 22:35

తిరుపతి: షిర్డీ-తిరుపతి రైలు ప్రారంభోత్సవానికి కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు శనివారం తిరుపతికి విచ్చేశారు

12/26/2015 - 22:35

చంద్రగిరి : శేషాచలం అటవీప్రాంతంలో కూంబింగ్ సిబ్బంది అడవిలో గాలిస్తుండగా సుమారు 40 మంది ఎర్రచందనం కూలీలు దుంగలు మోసుకొస్తూ ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా పోలీసులు గాల్లో కాల్పులు జరిపారు. 33 ఎర్రచందనం దుంగలు, ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు తిరుపతి డిఎస్పీ శ్రీనివాసులు శనివారం విలేఖర్లకు తెలిపారు.

12/26/2015 - 22:33

* చలి తీవ్రతకు గజగజలాడుతున్న భక్తజనం
తిరుపతి: శ్రీ వేంకటేశ్వరుని దర్శనార్థం వచ్చే భక్తులతో తిరుమల కిటకిటలాడుతోంది. వరుస సెలవుల నేపధ్యంలో గత మూడు రోజులుగా రద్దీ కొనసాగుతోంది. ఈ క్రమంలో శనివారం నాడు కూడా భక్తులు తిరుమలకు పోటెత్తారు. మరోవైపు చలి తీవ్రతకు భక్తులు గజగజలాడుతున్నారు.

12/26/2015 - 22:32

కడప : ఎర్రచందనం స్మగ్లర్లను తరిమికొడితే కేసులు ఉండవని రాయలసీమ జోన్ ఐజి గోపాలకృష్ణ అన్నారు. నల్లమల, శేషాచలం అటవీ పరిసర ప్రాంతాల్లోని యువకులు, ప్రజలు కలసికట్టుగా ఎర్రచందనం స్మగ్లర్లు, కూలీలను తరమికొట్టాలని పిలుపునిచ్చారు.ప్రస్తుతం అడవుల్లో బేస్‌క్యాంపులు, 280 సిసి కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు.

12/26/2015 - 22:32

శ్రీశైలం: శ్రీశైలంలో కొలువైన శ్రీ మల్లికార్జునస్వామి వారికి ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని శనివారం వార్షిక ఆరుద్ర ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈఉత్సవాన్ని ప్రతి నెల మాసోత్సవంగా నిర్వహిస్తుంటారు. ధనుర్మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం రోజున వార్షిక ఆరుద్ర ఉత్సవాన్ని జరిపించడం సంప్రదాయంగా వస్తోంది.

12/26/2015 - 22:30

మడకశిర: అనంతపురం జిల్లా మడకశిర మండలంలోని భక్తరహళ్లి లక్ష్మీనరసింహస్వామి, జిల్లేడుకుంట ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం భూతప్పల ఉత్సవం కన్నులపండువగా జరిగింది. భూతప్పలు భక్తులపై నుంచి నడుచుకుంటూ వెళ్లే దృశ్యాన్ని తిలకించేందుకు జనం భారీగా తరలివచ్చారు. భూతప్ప విగ్రహాన్ని చేతపట్టుకున్న వారి కాలిస్పర్శ తగిలితే కోర్కెలు తీరుతాయని భక్తుల నమ్మకం.

12/26/2015 - 19:10

గుంటూరు: ప్రజాకళామండలి కార్యదర్శి కోటిని పోలీసులు కిడ్నాప్ చేశారని పౌరహక్కుల సంఘం నేతలు ఆరోపిస్తున్నారు. ఆయనను తక్షణం విడుదల చేయాలని వివిధ సంఘాల నేతలు శనివారం డిమాండ్ చేశారు.

Pages