S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

12/28/2015 - 12:41

నెల్లూరు: ఇక్కడి విజయ డెయిరీలో 13 లక్షల రూపాయల నగదు గల్లంతయినట్లు అధికారులు సోమవారం ఉదయం గుర్తించారు. డెయిరీ కార్యాలయంలోని లాకర్‌ను తెరిచి చూడగా నగదు మాయమైనట్లు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. డెయిరీలో పనిచేస్తున్న వారే నగదు చోరీ చేసి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు.

12/28/2015 - 12:41

విజయవాడ: విశాఖ నగరం కేంద్రంగా ఐటి రంగాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని ఎ.పి. సి.ఎం. చంద్రబాబు ప్రకటించారు. మైక్రోసాఫ్ట్ సిఇవో సత్య నాదెళ్లతో భేటీ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ విశాఖ, అనంతపురం ప్రాంతాల్లో ఐటిని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తామన్నారు. ఈ రెండు జిల్లాల్లోనూ పర్యటించాల్సిందిగా సత్య నాదెళ్లను ఆయన ఆహ్వానించారు.

12/28/2015 - 12:40

ఒంగోలు: కొందరు టీచర్లు విధులకు గైర్హాజరు కావటంతో అందుకు తాను నైతిక బాధ్యత వహిస్తున్నట్లు ప్రకాశం జిల్లా పరిషత్ చైర్మన్ హరిబాబు వింత పద్ధతిలో నిరసన వ్యక్తం చేశారు. సోమవారం ఆయన తిమ్మాయపాలెం జెడ్పీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి కొందరు టీచర్లు గైర్హాజరయినట్లు గమనించారు. ఉపాధ్యాయుల తీరుకు తనదే బాధ్యతని ఆయన గ్రామస్థులతో చెప్పి, ఎండలో కొద్దిసేపు నిలబడ్డారు.

12/28/2015 - 12:39

విశాఖ: విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో చలి తీవ్రత పెరుగుతోంది. పాడేరు, చింతపల్లిలో 11 డిగ్రీలు, మినుములూరు, లంబసింగిలో 9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. దట్టంగా పొగమంచు అలముకోవటంతో రహదారులపై వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలుగుతోంది.

12/28/2015 - 12:37

విజయవాడ: ఎ.పి. సి.ఎం. చంద్రబాబు నాయుడుతో సోమవారం ఇక్కడ జపాన్ ఉన్నత స్థాయి బృందం భేటీ అయ్యింది. పర్యాటకం, ఫిషరీస్, ఫార్మా, తదితర రంగాల్లో సహాయం అందించేందుకు జపాన్ బృందం సంసిద్ధత వ్యక్తం చేసింది. పలు కీలక అంశాలపై జపాన్‌తో ఎ.పి. ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది.

12/28/2015 - 12:14

హైదరాబాద్: కొత్త సంవత్సరం, సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ నుంచి తెలంగాణ, ఆంధ్రల్లోని వివిధ ప్రాంతాలకు 2,715 బస్సులను నడపాలని తెలంగాణ ఆర్టీసీ నిర్ణయించింది. అన్ని జిల్లా కేంద్రాలకు ఈ ప్రత్యేక బస్సులు నడుపుతారు. రద్దీ పెరిగితే మరిన్ని సర్వీసులను అందుబాటులోకి తెస్తారు. అవసరమైతే ఎపిఎస్ ఆర్టీసీకి 500 బస్సులను ఇచ్చేందుకు కూడా ప్రతిపాదించారు. జనవరి 1 నుంచి 20 వరకూ ప్రత్యేక బస్సులను నడుపుతారు.

12/28/2015 - 12:13

హైదరాబాద్: మైక్రోసాఫ్ట్ సిఇఓ సత్య నాదెళ్ల సోమవారం ఉదయం ఎపి సిఎం చంద్రబాబును ఇక్కడ కలిశారు. బాబు నివాసంలో అల్పాహారానికి సత్య నాదెళ్ల వచ్చారు. ఈ సందర్భంగా ఉభయుల మధ్య ఎపి రాష్ట్ర ప్రగతికి అవసరమైన ప్రాజెక్టులపై కీలక ఒప్పందాలు కుదిరినట్లు సమాచారం. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు అన్ని విధాలా సహకరిస్తామని సత్య హామీ ఇచ్చారు.

12/28/2015 - 12:13

శ్రీకాకుళం: మద్యం వ్యాపారుల నుంచి లంచం తీసుకుంటుండగా శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన ఎక్సయిజ్ ఎస్‌ఐ, అయిదుగురు కానిస్టేబుళ్లను సోమవారం ఎసిబి అధికారులు వలపన్ని పట్టుకున్నారు. నిందితుల నుంచి నగదును స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశారు.

12/28/2015 - 12:12

హైదరాబాద్: ఎపి మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, రావెల కిశోర్‌బాబు సోమవారం ఉదయం ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌ను రాజ్‌భవన్‌లో కలిశారు. అనంతపురం జిల్లాలో మంగళవారం ప్రారంభించే నీరు-ప్రగతి కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా వారు గవర్నర్‌ను ఆహ్వానించారు.

12/27/2015 - 21:21

*రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్య
*బేగంపేట్‌లో ఘటన..ముగ్గురి లొంగుబాటు

Pages