S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

12/25/2015 - 21:32

విజయవాడ: పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన రాష్టప్రతి ప్రణబ్‌ముఖర్జీకి ముఖ్యమంత్రి, తదితరులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం తిరుపతి బయలుదేరి వెళ్లారు.

12/25/2015 - 21:30

విజయవాడ: విజయవాడలోని గుణదల మేరిమాత పుణ్యక్షేత్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు క్రిస్మస్ ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీస్తు మార్గం అనుసరణీయమన్నారు.

12/25/2015 - 21:29

నందిగామ: కృష్ణా జిల్లా కంచికచర్ల వద్ద గురువారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మరణించారు. బైక్‌పై వెళుతున్న వీరిని ఎదురుగా వస్తున్న వ్యాన్ ఢీకొన్న ఘటనలో వీరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

12/25/2015 - 21:28

తూర్పు గోదావరి జిల్లా ద్రాక్షారామలో గత ఆరు రోజులుగా నిర్వహిస్తున్న అతిరుద్రం మహాయజ్ఞం శుక్రవారం ముగిసింది.

12/25/2015 - 21:27

తిరుమల: తిరుమలలో శుక్రవారం రాత్రి శ్రీవారికి వైభవంగా పౌర్ణమి గరుడ సేవ జరిగింది. తిరుమల శ్రీవారిని శుక్రవారం రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ, గవర్నర్ నరసింహన్, సిఎం చంద్రబాబు దర్శించుకున్నారు. ముగ్గురూ ఏమీ మాట్లాడలేదు.

12/25/2015 - 21:26

కడప : తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చేనెల 2వ తేది నుంచి తిరిగి ప్రారంభంకానున్న జన్మభూమి కార్యక్రమంతో అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజల వద్దకే అధికారులు వెళ్లి అర్జీలు స్వీకరించి, సమస్యలు పరిష్కరించాల్సి ఉంది.

12/25/2015 - 21:26

అమరాపురం: అనంతపురం జిల్లా అమరాపురం మండలం కెంకర గ్రామ సమీపంలో శుక్రవారం ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. చిలమత్తూరుకు చెందిన శ్రీధర్ తన కుటుంబసభ్యులతో కలిసి దైవదర్శనానికి వెళ్లి తిరిగి ఆటోలో వస్తుండగా ప్రమాదం జరిగింది. దీంతో శ్రీధర్ అక్కడికక్కడే మృతి చెందారు.

12/25/2015 - 21:24

పులివెందుల : కడప జిల్లా పులివెందులలోని సిఎస్‌ఐ చర్చిలో శుక్రవారం జరిగిన క్రిస్మస్ వేడుకల్లో వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కుటుంబసభ్యులతో కలిసి పాల్గొన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన తల్లి విజయమ్మ, భార్య వైఎస్.్భరతి, మాజీ మంత్రి వివేకానందరెడ్డి, కడప ఎంపి వైఎస్.అవినాష్‌రెడ్డి ఇతర కుటుంబ సభ్యులు ఉదయం చర్చికి చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

12/25/2015 - 16:59

విజయవాడ: నగర టాస్క్ఫోర్స్ పోలీసులు శుక్రవారం ఆకస్మిక దాడులు చేసి ఇక్కడి వన్‌టౌన్ ప్రాంతంలో 5వేల పైరసీ సీడీలు స్వాధీనం చేసుకున్నారు. జతకలిసె, సౌఖ్యం, శంకరాభరణం (కొత్తది), బెంగాల్ టైగర్ వంటి తాజా సినిమాలకు సంబంధించి భారీఎత్తున సీడీలను సీజ్ చేసి, వీటిని విక్రయిస్తున్న సురేష్ అనే నిందితుడిని పోలీసుల అదుపులోకి తీసుకున్నారు.

12/25/2015 - 16:58

తిరుమల: రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ శుక్రవారం మధ్యాహ్నం తిరుమల చేరుకున్నారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి ఆయన రోడ్డు మార్గంలో ఇక్కడికి చేరుకున్నారు. ఈరోజు ఆయన స్వామివారిని దర్శించుకుని అర్చనలు చేస్తారు. గవర్నర్ నరసింహన్, సిఎం చంద్రబాబు, పలువురు మంత్రులు రాష్టప్రతి వెంట ఉన్నారు.

Pages