S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

12/25/2015 - 05:50

రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ప్రత్యామ్నాయంగా అవతరించిన వైకాపా చంద్రబాబు ఏకపక్ష విధానాలను వ్యతిరేకంగా గట్టి పోరాటం చేస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్, వామపక్షాల కార్యకలాపాలు దాదాపు చతికిలపడ్డాయి. దీంతో బాబును వ్యతిరేకించే నేతలు, పార్టీలు జగన్మోహన్ వైపు చూస్తున్నారు.

12/25/2015 - 05:49

అందరికీ విద్యుత్, మిగులు విద్యుత్, విద్యుత్ పొదుపు చేయడంలో ఎల్‌ఇడి బల్బులను అమర్చడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచింది. రాష్ట్రంలో విద్యుత్ కోతలు లేవు. రైతులకు నిరాటంకంగా ఏడు గంటల విద్యుత్ లభిస్తోంది. పారిశ్రామిక రంగంలో విద్యుత్ కోతలంటే ఏమిటో మర్చిపోయారు. 2015లో ఏపి జెన్కో రెండు సంచలనమైన విజయాలు సాధించింది.

12/25/2015 - 05:48

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలను ఓటుకు నోటు స్కాం, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కుదిపేసింది. 2015లో రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాల మధ్య ఘర్షణకు దారితీసేదిగా ఈ సంఘటనలు సంచలనం కలిగించాయి.

12/24/2015 - 15:08

విశాఖ: విశాఖ నగరంలో కాల్‌మనీ పేరిట అకృత్యాలకు పాల్పడుతున్న గుడివాడ రామకృష్ణ అనే వ్యక్తిని తిరుపతిలో అదుపులోకి తీసుకుని విశాఖ పోలీసులు ఈరోజు మీడియా ఎదుట హాజరుపరిచారు. అతడి ఇంట్లో పోలీసులు సోదాలు చేసి భారీగా డాక్యుమెంట్లు, ప్రామిసరీ నోట్లు, రెండు వాహనాలు, నాలుగు కత్తులను స్వాధీనం చేసుకున్నారు.

12/24/2015 - 15:07

కాకినాడ: తూర్పు గోదావరి జిల్లా కోరుకొండలో గురువారం ఓ ఉన్మాది బీభత్సం సృష్టించి ఇద్దరిని బలిగొన్నాడు. ఆ ఉన్మాది తొలుత తన ఇంట్లో వదినను హత్య చేసి ఆ తర్వాత బస్టాండ్ వద్ద వీరంగం చేశాడు. ఉన్మాది దాడిలో నాగభూషణం అనే వ్యాపారి ప్రాణాలు కోల్పోయాడు. గాయపడిన స్థానిక ఎంపిటిసి సభ్యురాలిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. కాసేపటికి పోలీసులు బస్టాండ్ వద్దకు చేరుకుని ఉన్మాదిని అదుపులోకి తీసుకున్నారు.

12/24/2015 - 15:07

విశాఖ: విశాఖ జిల్లా తుమ్మపాల వద్ద గురువారం ఉదయం ఎక్సయిజ్ పోలీసులు తనిఖీలు నిర్వహించి, ఓ తవుడు లారీలో రవాణా చేస్తున్న సుమారు పది లక్షల రూపాయల విలువ చేసే మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మద్యాన్ని ఒడిశా నుంచి తెస్తున్నట్లు వారు చెబుతున్నారు.

12/24/2015 - 15:06

హైదరాబాద్: అసెంబ్లీలో వైకాపా ఎమ్మెల్యేల ప్రవర్తన తీరు తనకు ఆందోళన కలిగించిందని, ఇలాంటి ప్రవర్తనను తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడలేదని శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. ఆయన గురువారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ, తాను ఎంత చెప్పినా వినకపోవడం వల్లే వైకాపా ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెండ్ చేశామన్నారు.

12/24/2015 - 11:54

గుంటూరు:ప్రమాదవశాత్తు రైలునుంచి జారిపడి తల్లీ కూతురు మరణించిన సంఘటన చుండూరు మండలం ఎడ్లపల్లిలో గురువారం ఉదయం జరిగింది. ఇదే సంఘటనలో గాయపడిన బాలుడిని ఆసుపత్రికి తరలించారు.

12/24/2015 - 11:53

ఒంగోలు:శబరిమలైనుంచి శ్రీకాకుళం జిల్లాకు భక్తులతో వెళుతున్న ఓ బస్సు రోడ్డుపై ఆగివున్న లారీని ఢీకొనడంతో ఒకరు మరణించగా, 24మంది గాయపడ్డారు. పొంగులూరు మండలం, జాగర్లమూడివారి పాలెం వద్ద గురువారం ఉదయం ఈ దుర్ఘటన జరిగింది. తీవ్రంగా గాయపడిన వారిని విజయవాడ, ఒంగోలు ఆసుపత్రులకు తరలించారు.

12/24/2015 - 11:51

విశాఖ:విశాఖ జిల్లా దేవరాపల్లిలో మంగళవారం కిడ్నాప్‌కు గురైన ఏడేళ్ళ దివ్య హత్యకు గురైనట్లు పోలీసులు నిర్థారించారు. ఆమె మృతదేహాన్ని గురువారం ఉదయం రైవాడ వరద గేట్లవద్ద కనుగొన్నారు. మేనమామ తంబి దివ్యను అపహరించి ఈ ఘాతుకానికి ఒడికట్టినట్టు బంధువులు ఆరోపిస్తున్నారు. కుటుంబ కలహాలే ఇందుకు కారణమని పోలీసులు చెబుతున్నారు.

Pages