S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

12/23/2015 - 17:41

అమలాపురం: తనకు తెలియకుండా 90 వేల రూపాయలు అప్పు తీసుకున్నందుకు భర్త మందలించడంతో భార్య ఆత్మహత్య చేసుకుంది. అల్లవరం మండలం బోడసకుర్రులో బుధవారం ఉదయం లక్ష్మి, ఆమె భర్త అప్పు విషయమై ఘర్షణ పడ్డారు. బాకీ తీర్చకపోవడంతో అప్పు ఇచ్చిన వారు ఇంటికి వచ్చి నిలదీయడంతో ఈ దంపతులు గొడవ పడ్డారు.

12/23/2015 - 17:41

విశాఖ: ఏడేళ్ల బాలిక అదృశ్యంపై ఆమె మేనమామను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. విశాఖ జిల్లా దేవరాపల్లిలో తన కుమార్తె కనిపించకుండా పోయిందని, ఆమెపై అత్యాచారం చేసి హత్య చేసి ఉంటారని తల్లి ధనలక్ష్మి బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. మేనమామ గుణశేఖర్ ఈ దారుణానికి ఒడిగట్టాడని ఆమె ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అరెస్టు చేసి బాలిక ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

12/23/2015 - 16:49

అనంతపురం: ఉద్యోగాలు ఇప్పిస్తామని యువకులను మోసం చేసిన నలుగురు దళారులను స్థానిక పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. సుమారు 315 మంది నుంచి నిందితులు మూడు కోట్ల రూపాయలు వసూలు చేశారు. ఎన్ని రోజులు గడిచినా ఉద్యోగాలు రాకపోవడంతో అనుమానించిన బాధిత యువకులు చివరికి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులపై నిఘా పెట్టి ఎట్టకేలకు వారిని పోలీసులు అరెస్టు చేసి కేసులు నమోదు చేశారు.

12/23/2015 - 11:38

కాకినాడ: వడ్డీ వ్యాపారుల వేధింపులు భరించలేక ఓ మహిళ ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించి, చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మరణించింది. అల్లవరం మండలం బోధన్‌కుర్రుపాలెం లో బుధవారం లక్ష్మి అనే మహిళ ఆత్మహత్యకు పాల్పడటంతో వడ్డీ వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని బంధువులు ఆందోళన ప్రారంభించారు.

12/23/2015 - 11:37

విజయవాడ: వేగంగా వస్తున్న లారీ ఓ ఆటోను ఢీకొనడంతో ఇద్దరు చిన్నారులు మరణించారు. ఇక్కడి ఇబ్రహీంపట్నం వద్ద బుధవారం ఉదయం ఈ దుర్ఘటన జరిగింది. ఇదే సంఘటనలో గాయపడిన ముగ్గురిని ఆస్పత్రికి తరలించారు.

12/23/2015 - 11:36

హైదరాబాద్: ఎ.పి. అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై వైకాపా ఎమ్మెల్యేలు అవిశ్వాస తీర్మానాన్ని సిద్ధం చేశారు. ఈ రోజు మధ్యాహ్నం వారు అసెంబ్లీకి చేరుకొని ఈ నోటీసును అందజేస్తారు. అవిశ్వాసం కోరుతూ 67 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు.

12/23/2015 - 11:35

తిరుపతి: చంద్రగిరి మండలం నారావారిపల్లి ఫారెస్టు ఏరియాలో బుధవారం ఉదయం పోలీసులు విస్తృతంగా సోదాలు చేసి సుమారు రెండు కోట్ల విలువ చేసే ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా తమిళనాడుకు చెందిన ఓ స్మగ్లర్‌ను అరెస్టు చేయగా, మరి కొందరు స్మగ్లర్లు తప్పించుకొన్నారు.

12/23/2015 - 11:35

నెల్లూరు: చిల్లకూరు మండలం కడివేడు వద్ద బుధవారం ఉదయం ఆటో బోల్తాపడి నలుగురు మరణించారు. మృతులలో ముగ్గురు మహిళలున్నారు. ఇదే సంఘటనలో గాయపడిన మరో ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు.

12/23/2015 - 11:35

కర్నూలు: ఆర్ అండ్ బిలో డిఇగా పని చేస్తున్న శంకర్ రెడ్డి నివాసంలో ఎసిబి అధికారులు బుధవారం ఉదయం దాడులు నిర్వహించారు. కోట్లాది రూపాయలు విలువైన స్థిర చరాస్తులు ఆయనకు ఉన్నట్లు కనుగొన్నారు.

12/23/2015 - 11:34

హైదరాబాద్: శాసనసభలో అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ గందరగోళం సృష్టిస్తున్న వైకాపా ఎమ్మెల్యేలు సభాపతిపై అవిశ్వాస తీర్మానం పెడతామనటం హాస్యాస్పదంగా ఉందని ఎ.పి. మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ వైకాపా ఎమ్మెల్యే రోజా సభలో వ్యవహరించిన తీరు అత్యంత నీచంగా ఉందని వ్యాఖ్యానించారు. విపక్ష ఎమ్మెల్యేల వ్యవహార శైలిని ప్రజలు గమనిస్తూనే ఉన్నారని అన్నారు.

Pages