S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

12/22/2015 - 11:48

విజయనగరం: భోగాపురం మండలం మహరాజుపేట వద్ద మంగళవారం ఉదయం విశాఖ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఓ లారీ ఢీకొన్న సంఘటనలో 40 ఏళ్ల గుర్తు తెలియని మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. గాయపడని మరో ముగ్గురిని విశాఖ కెజిహెచ్‌కు తరలించగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

12/22/2015 - 11:47

హైదరాబాద్: విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ టిడిపిలో చేరేందుకు రంగం సిద్ధమైంది. ఎ.పి. మంత్రి అయ్యన్న పాత్రుడు మంగళవారం ఉదయం కొణతాలను ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు తీసుకువెళ్లారు. మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ కూడా బాబును కలిశారు. ఎ.పి. టిడిపి అధ్యక్షుడు కళా వెంకట్రావు కూడా కొణతాలతో మాట్లాడారు.

12/22/2015 - 11:46

గుంటూరు: గుంటూరు జిల్లా పంచాయతీ అధికారి గోరంట్ల వీరయ్య నివాసంతోపాటు ఆయన బంధువుల ఇళ్లలో మంగళవారం ఉదయం ఏసిబి అధికారులు ఏకకాలంలో సోదాలు ప్రారంభించారు. ఆదాయానికి మించి అక్రమ ఆస్తులలు ఉన్నట్లు ఫిర్యాదులు రావడంతో గుంటూరు, నరసరావుపేట, చీరాల తదితర ప్రాంతాల్లో వీరయ్య ఆస్తులపై అధికారులు ఆరా తీస్తున్నారు.

12/22/2015 - 11:46

తిరుమల: వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో స్వామివారికి మంగళవారం ఉదయం చక్రస్నాన మహోత్సవం వేడుకగా నిర్వహించారు. ఈ ఉత్సవాన్ని తిలకించేందకు భారీ సంఖ్యలో భక్తులు ఉదయం నించీ బారులు తీరారు. టిటిడి ఇవో సాంబశివరావు, అధ్యక్షుడు చదలవాడ కృష్ణమూర్తి తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

12/22/2015 - 08:15

రామచంద్రపురం, డిసెంబర్ 21: దక్షిణ కాశీ తూర్పు గోదావరి జిల్లా ద్రాక్షారామ పంచారామ శైవక్షేత్రంలో నిర్వహిస్తున్న అతిరుద్ర మహాయజ్ఞం సోమవారం రెండో రోజుకు చేరింది. వైకుంఠ ఏకాదశి, శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన సోమవారం కావడంతో భక్తులు పోటెత్తారు. ఉదయం 6.30 గంటలకు రుత్విక్కులు గురువందనం, వేద పారాయణం, గురుప్రార్ధన మహన్యాసం నిర్వహించారు.

12/22/2015 - 08:13

విజయవాడ, డిసెంబర్ 21: అమ్మవారి భవానీ దీక్షల విరమణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు సుమారు రూ.4కోట్ల వ్యయంతో విస్తృత ఏర్పాట్లు చేసినట్లు విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఇవో సిహెచ్ నరసింగరావు తెలిపారు. అమ్మవారి భవానీ దీక్ష మండపంలో సోమవారం ఉదయం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు.

12/21/2015 - 16:42

అనంతపురం: కాల్‌మనీ వ్యాపారానికి ప్రభుత్వమే మద్దతు పలుకుతోందని, దీనిపై చర్యలు తీసుకోవాల్సింది పోయి.. శాసనసభలో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన మహిళా ఎమ్మెల్యే రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేయడం దారుణమని సీపీఐ అనుబంధ మహిళా సమాఖ్య (ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ) జాతీయ కార్యదర్శి బీవీ విజయలక్ష్మి అన్నారు.

12/21/2015 - 13:55

తిరుమల : వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలకు భక్తులు పోటెత్తారు. స్వామివారి వైకుంఠ ద్వార దర్శనం కోసం గంటల తరబడి క్యూలైన్లలో వేచి చేస్తున్నారు. 24 గంటల ముందే భక్తులను క్యూలోకి అనుమతించిన టీటీడీ అన్ని మౌలిక వసతులు కల్పించింది. ఈరోజు స్వామివారిని రికార్టుస్థాయిలో భక్తులు దర్శించుకున్నట్లు తితిదే అధికారులు తెలిపారు.

12/21/2015 - 11:54

హైదరాబాద్: ఎ.పి. శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు వైకాపా నేతలు యోచిస్తున్నట్లు సమాచారం. ఈ రోజు ఉదయం అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించి బయటకు వెళ్లిపోయిన తరువాత వైకాపా ఎమ్మెల్యేలు ఈ విషయమై చర్చించినట్టు తెలుస్తోంది. స్పీకర్‌పై అవిశ్వాసం ప్రవేశపెట్టే అంశంపై రేపు ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

12/21/2015 - 11:53

తిరుమల: వైకుంఠ ఏకాదశి సందర్భంగా సోమవారం ఉదయం స్వామివారిని స్వర్ణ రథంపై తిరువీధుల్లో ఊరేగిస్తుండగా భక్తుల రద్దీ అధికమై స్వల్ప ప్రమాదం చోటు చేసుకుంది. ఇనుప మెట్లపై ఎక్కిన భక్తులు కిందికి జారి పడ్డారు. దీంతో గాయపడిన ముగ్గురిని ఆస్పత్రికి తరలించారు.

Pages