ఆంధ్రప్రదేశ్‌

వెలుగులు.. జిలుగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందరికీ విద్యుత్, మిగులు విద్యుత్, విద్యుత్ పొదుపు చేయడంలో ఎల్‌ఇడి బల్బులను అమర్చడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచింది. రాష్ట్రంలో విద్యుత్ కోతలు లేవు. రైతులకు నిరాటంకంగా ఏడు గంటల విద్యుత్ లభిస్తోంది. పారిశ్రామిక రంగంలో విద్యుత్ కోతలంటే ఏమిటో మర్చిపోయారు. 2015లో ఏపి జెన్కో రెండు సంచలనమైన విజయాలు సాధించింది. కృష్ణపట్నం థర్మల్ ప్లాంట్ మొదటి దశ 800 మెగావాట్లు, రెండవ దశలో మరో 800 మెగావాట్ల వాణిజ్య ఉత్పత్తిని సాధించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు డిసెంబర్ 10న కృష్ణపట్నం థర్మల్ ప్లాంట్, విజయవాడ థర్మల్ ప్లాంట్ 800 మెగావాట్ల విస్తరణకు రూ.430 కోట్ల చెక్‌ను బిహెచ్‌ఇఎల్‌కు అందచేశారు. 2018-19 నాటికి పీక్ వేళల్లో 13,500 మెగావాట్ల విద్యుత్ ఉంటుందని, ప్రస్తుతం 82,392 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ ఉందని విద్యుత్ అధికారులు చెప్పారు. కాంపిటీటివ్ బిడ్డింగ్ ద్వారా రెండు వేల మెగావాట్ల విద్యుత్‌ను కొనుగోలుకు ఒప్పందాలు చేశారు. వచ్చే ఐదేళ్లలో 3800మెగావాట్ల థర్మల్, ఇండిపెండెంట్ పవర్ ప్రాజెక్టుల ద్వారా 1040 మెగావాట్లు, ఎన్టీపిసి ద్వారా నాలుగువేల మెగావాట్ల విద్యుత్‌ను, న్యూక్లియర్ విద్యుత్ ఆరువేల మెగావాట్లు, సిజిఎస్ వాటా కింద 1950 మెగావాట్లు, జల విద్యుత్ 1010 మెగావాట్లు, సౌర విద్యుత్ 5030 మెగావాట్ల విద్యుత్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దేశంలో సౌర విద్యుత్ ఉత్పత్తిలో అతిపెద్ద భాగస్వామిగా ఆంధ్రప్రదేశ్ అవతరించింది. అనంతపురంలో 1500 మెగావాట్లు, కర్నూలు జిల్లాలో 1000 మెగావాట్లు, కడపలో 1500 మెగావాట్ల ఆల్ట్రా మెగావాట్ల మెగా సోలార్ పార్కులను ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 27263.58 ఎకరాల భూమిని సోలార్ పార్కులను ఏర్పాటు చేసేందుకు కేటాయించారు. ఇందులో ఏపిఎస్‌పిసిఎల్‌కు 12037.88 ఎకరాలను ఇచ్చారు. విద్యుత్ పొదుపుకు దశలవారీగా 12,900 గ్రామ పంచాయితీల్లో ఎల్‌ఇడి వీధి దీపాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇంటింటికి స్టార్ రేటెడ్ విద్యుత్ ఉపకరణాలను అందచేసే కార్యక్రమాన్ని చేపట్టారు. దేశం మొత్తం మీద 3 కోట్ల 70 లక్షల ఎల్‌ఇడి బల్బులను పంపిణీ చేస్తే, మన రాష్ట్రంలోనే 2015లో 1.25 కోట్ల ఎల్‌ఇడి బల్బులను పంపిణీ చేశారు. దీని వల్ల ఒక్క గృహ రంగంలోనే ఐదు వందల మెగావాట్ల విద్యుత్‌ను ఆదా చేసేందుకు అవకాశం ఏర్పడింది. వచ్చే ఏడాది మార్చి లోపల కోటి కుటుంబాలకు రెండు ఎల్‌ఇడి బల్బులను పంపిణీ చేయాలని ఇంధన సంరక్షణ సంఘం లక్ష్యంగా పెట్టుకుంది. గ్యాస్ విద్యుత్ రంగంలో కేంద్రం ప్రకటించిన పూలింగ్ విధానం వల్ల 50 వేల కోట్ల పెట్టుబడులతో పెట్టిన గ్యాస్ విద్యుత్ ప్రాజెక్టులకు ప్రాణం వచ్చింది. దాదాపు శిథిలావస్ధకుచేరిన గ్యాస్ విద్యుత్ ప్రాజెక్టుల నుంచి ప్రస్తుతం సగటున రోజు వెయ్యి మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. విద్యుత్ ఆదా విభాగంలో ఐదు అవార్డులు, విద్యుత్ రంగాన్ని అభివృద్ధి దిశగా నడిపినందుకు శౌర్యరత్న అవార్డు ఏపి ట్రాన్స్‌కో చైర్మన్ ఎండి కె విజయానంద్‌కు లభించాయి. రాష్ట్రంలో థర్మల్ విద్యుత్ ప్లాంట్లు ఎన్టీపిసి కంటే ఎక్కువగా 80.71 శాతం పిఎల్‌ఎఫ్ సాధించినందుకు ఉత్తమ సామర్ధ్యం విద్యుత్ ఉత్పత్తి అవార్డులు ఏపి జెన్కోకు లభించాయి.
పరిశ్రమలు-వౌలిక సదుపాయాలు
ప్రభుత్వం ప్రకటించిన కొత్త పారిశ్రామిక విధానం జాతీయ, అంతర్జాతీయ స్ధాయిలో పారిశ్రామికవేత్తలను ఆకట్టుకుంటోంది. 2015లో డిసెంబర్ 15 వరకు దాదాపు 90,377 కోట్ల పెట్టుబడితో 1,88,856 మందికి ఉపాధి కల్పించే సామర్ధ్యం ఉన్న పరిశ్రమలను నెలకొల్పేందుకు 177 దరఖాస్తులు వచ్చాయి. దొనకొండ, తిరుపతి, విశాఖపట్నం, అమరావతి రాజధాని ప్రాంతం శివార్లలో పారిశ్రామిక, ఎలక్ట్రానిక్స్, ఐటి, మ్యానుఫ్యాక్చర్ జోన్లను ఏర్పాటు చేయనున్నారు. విశాఖ-చెన్నై పపారిశ్రామిక కారిడార్ పూర్తయితే ఒక లక్ష కోట్ల పెట్టుబడులు వస్తాయని, 50 వేల మందికి ఉపాధి కల్పన జరుగుతుందని ఆసియా అభివృద్ధి బ్యాంకు పేర్కొంది. జైన్ ఇరిగేషన్, గుజరాత్ అంబుజా ఎక్స్‌పోర్ట్, జయరాజ్ ఇస్పాట్, ఆల్ట్రాటెక్ వితల్, ఇన్నోవేషన్, రాంకో, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వంటి ప్రధాన పెట్టుబడి సంస్ధలు 12వేల కోట్ల పెట్టుబడితో 22వేల మందికి ఉపాధి కల్పించేందుకు కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పరిశ్రమలను నెలకొల్పనున్నాయి. ఆల్ట్రాటెక్ సిమెంట్‌ను కర్నూలు జిల్లాలో నాలుగువేల కోట్లతో, మెసర్స్ జైరాజ్ ఇస్పాట్‌ను మూడు వేల కోట్లతో, ఓర్వకల్లు వద్ద డిఆర్‌డిఒను వెయ్యి కోట్లతో మాసర్స్ రాంకో సిమెంట్స్‌ను 1200 కోట్లతో, జైన్ ఇరిగేషన్‌ను 365 కోట్లతో, తేజ సిమెంట్స్‌ను రూ.1500 కోట్లతో, బిఇఎల్‌ను అనంతపురంలో ఐదు వందల కోట్లతో, మెసర్స్‌విఠల్ ఇన్నోవేషన్ సిటీని రెండు వందల కోట్లతో అనంతపురంలో నెలకొల్పేందుకు ఎంఓయులు ఖరారయ్యాయి. విశాఖపట్నం చెన్నై పారిశ్రామిక కారిడార్‌లో 840 మిలియన్ల డాలర్లతో నిర్మించనున్నారు. అనంతపురం, చిత్తూరు, నెల్లూరు జిల్లాల అనుసంధానంగా పనిచేసే చెన్నై-బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌కు రూ.18,548 కోట్ల వ్యయమవుతుందని అంచనా. 973 కి.మీ పొడువున్న సముద్ర తీరాన్ని అభివృద్ధి చేసేందుకు రాష్ట్రప్రభుత్వం మారిటైం బోర్డును ఏర్పాటు చేయడం విశేషం.