ఆంధ్రప్రదేశ్‌

కసురుకున్నారు.. కలిసిపోయారు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలను ఓటుకు నోటు స్కాం, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కుదిపేసింది. 2015లో రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాల మధ్య ఘర్షణకు దారితీసేదిగా ఈ సంఘటనలు సంచలనం కలిగించాయి. తమ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యేకు డబ్బు ఎరచూపి తమ పార్టీ అభ్యర్థిని గెలిపించుకునేందుకు టిడిపి అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రయత్నించారని అభియోగం. ఈ కేసు ఈ ఏడాది మే 31న హైదరాబాద్‌లో జరిగింది. ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు తమ పార్టీ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు కుట్రపన్నారని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఆరోపిచానర. ఈ కేసులో నిందితులు టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, సెభాష్టియన్‌ను తెలంగాణ అవినీతి నిరోధక శాఖ పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. ఈ ఉదంతాన్ని వీడియో తీసి మీడియాకు విడుదల చేశారు.
కాగా హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కావడంతో తమకు సమానాధికారాలు ఉన్నాయని, తాము మాట్లాడే ఫోన్లను టిఆర్‌ఎస్ ప్రభుత్వం ట్యాపింగ్ చేసిందని ఆంధ్రపదేశ్ ప్రభుత్వం వాదన. తమ ఫోన్లను ట్యాపింగ్ చేశారనేదానికి తమ వద్ద తిరుగు లేని ఆధారాలు ఉన్నాయంటూ విజయవాడ భవానీ పురం పోలీసు స్టేషన్‌లో ఏపి ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. దీనిపై విజయవాడ కోర్టు తెలంగాణ అధికారులకు నోటీసులు కూడా జారీ చేసింది. ఓటుకు నోటు స్కాంతో చంద్రబాబు, కె చంద్రశేఖరరావు మధ్య సంబంధాలు మునుపెన్నడూ లేని విధంగా క్షీణించాయి. ఓటుకు నోటు స్కాంలో రేవంత్ రెడ్డి, సెభాష్టియన్, మరో టిడిపి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అరెస్టయి జైలుకు వెళ్లి బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ కేసుతో చంద్రబాబు కీర్తిప్రతిష్టలు మసకబారాయనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమైంది. చంద్రబాబు ఈ కేసులో ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో మొబైల్ ఫోన్‌లో మాట్లాడిన వీడియో, ఆడియో టేపులు కూడా విడుదలయ్యాయి. ఏసిబి ఈ కేసుపై దర్యాప్తును వేగవంతం చేసింది. ఫోన్ టేపులు, అందులో మాట్లాడిన వ్యక్తుల గొంతు శాంపిల్స్‌ను ఫోరెన్సిక్ ల్యాబోరేటరీకి పంపారు. మే నెల నుంచి సెప్టెంబర్ నెల వరకు దాదాపు ఐదు నెలలపాటు ఈ కేసుల వివాదంతో రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అగాధం పెరిగింది. చివరకు గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ తేనీటి విందుకు ఆహ్వానించినా ముఖ్యమంత్రులు హాజరు కాలేదు.
అక్టోబర్ తర్వాత మారిన సీను
అక్టోబర్ నుంచి రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపనకు రావాల్సిందిగా తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఇంటికి వెళ్లి స్వయంగా ఆహ్వానించారు. ఈ సంఘటనతో అంతవరకు ఉన్న ఉద్రిక్త, ఉద్వేగ వాతావరణం మటుమాయమైంది. అమరావతి రాజధాని శంకుస్థాపనకు అక్టోబర్ 22వ తేదీన కె చంద్రశేఖరరావు వెళ్లడం, అక్కడ చంద్రశేఖరరావుకు ప్రజలు, ఆంధ్రప్రభుత్వం బ్రహ్మరథం పట్టారు. చంద్రశేఖరరావు మాట్లాడిన తీరు ఆంధ్ర ప్రజలను సంభ్రమాశ్చర్యానికి గురిచేసింది.
తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు మెదక్ జిల్లా ఎర్రవెల్లిలోని తన ఫామ్‌హౌస్‌లో మహా అయుత చండీయాగానికి ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఆహ్వానించారు. ఆయన అమరావతిలో ఉన్న చంద్రబాబు వద్దకు ప్రత్యేక హెలికాప్టర్‌లో వెళ్లి ఆహ్వానించారు. ఈ యాగానికి రావడానికి చంద్రబాబు అంగీకరించడమే కాకుండా ఇరువురు అనేక అంశాలపై ఏకాంతంగా చర్చించారు. ఇవన్నీ శుభ పరిణామాలే. 2015 జనవరిలో నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద ఖరీఫ్‌కు నీటిని వదలాలంటూ ఆంధ్ర పోలీసులు, వదిలే ప్రసక్తిలేదంటూ తెలంగాణ పోలీసుల మధ్య ఘర్షణ తలెత్తింది. దీంతో భవిష్యత్తులో ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయోనని ఆందోళన చెందారు. కాని డిసెంబర్ నెల వచ్చేసరికి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య స్నేహపూర్వక సంబంధాలు వెల్లివిరియడం పట్ల ప్రజలు స్వాగతిస్తున్నారు. కాని ఈ సత్సంబంధాలు శాశ్వతంగా ఉంటాయా లేక గ్రేటర్ హైదరాబాద్ నగరపాలక సంస్థ ఎన్నికల్లో మళ్లీ నువ్వా నేనా అన్నట్లుగా ఒకరిని ఒకరు ఆడిపోసుకుంటారా అనేది వేచి చూడాల్సిందే.

- శైలేంద్ర