ఆంధ్రప్రదేశ్‌

జనంలోకి జగన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ప్రత్యామ్నాయంగా అవతరించిన వైకాపా చంద్రబాబు ఏకపక్ష విధానాలను వ్యతిరేకంగా గట్టి పోరాటం చేస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్, వామపక్షాల కార్యకలాపాలు దాదాపు చతికిలపడ్డాయి. దీంతో బాబును వ్యతిరేకించే నేతలు, పార్టీలు జగన్మోహన్ వైపు చూస్తున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలే అజెండాగా, ఊపిరిగా నడుస్తున్న జగన్ అసెంబ్లీ లోపల, వెలుపల టిడిపికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారనేది నిర్వివాదాంశం. అసెంబ్లీలో 67 మంది ఎమ్మెల్యేలు, లోక్‌సభలో 9 మంది ఎంపీల బలం ఉన్న వైకాపా 2015లో వివిధ అంశాలపై కేంద్ర రాష్ట్రప్రభుత్వాల ఒంటెత్తుపోకడలకు నిరసనగా ఉద్యమాలు చేసింది. రాష్ట్ర విభజన తర్వాత ఆర్థికంగా దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంటు వేదికగా కాంగ్రెస్, బిజెపి హామీ ఇచ్చాయి. ఆంధ్రాకు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ జగన్ ఈ ఏడాది అక్టోబర్ 7 నుంచి గుంటూరులో ఆమరణ దీక్ష చేశారు. 2013లో కూడా రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ హైదరాబాద్‌లో వారం రోజుల పాటు ఆమరణ దీక్ష చేసిన విషయం విదితమే. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ఎంపిక చేసినందుకు తాము వ్యతిరేకించడం లేదని, కాని భూసమీకరణ విధానాన్ని వ్యతిరేకిస్తున్నామని, బలవంతంగా భూములను సేకరించవద్దని జగన్ ఉద్యమాన్ని చేపట్టారు. ఈ ఏడాది మూడుసార్లుఅసెంబ్లీ సమావేశాలు జరిగాయి. మార్చిలో బడ్జెట్ సమావేశాలు, ఆగస్టు-సెప్టెంబర్‌లో వర్షాకాల సమావేశాలు, తాజాగా డిసెంబర్‌లో శీతాకాల సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాల్లో వైకాపా ప్రజా సమస్యలపై ప్రభుత్వంపై వత్తిడి తెచ్చేందుకు రాజీలేని పోరాటం చేసింది. వైకాపా ఎమ్మెల్యే రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేసినందుకు ఈ నెల 21, 22 తేదీల్లో రెండు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలను వైకాపా బహిష్కరించింది. డిసెంబర్ 23వ తేదీన వైకాపా సభ్యులు స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై అవిశ్వాసతీర్మానం నోటీసు కూడా ఇచ్చారు. బాక్సైట్ తవ్వకాలు, మద్యం మాఫియా, ఇసుక మాఫియాపై వైకాపా ప్రజల్లోకి వెళ్లి ఉద్యమాలు నిర్వహించింది. ఆంధ్రకు ప్రత్యేక హోదా కల్పిస్తారని అమరావతి శంకుస్ధాపన సభలో ప్రధానమంత్రి ప్రకటిస్తారని ఎదురుచూశామని, కాని చివరకు పిడికెడు మట్టి, చెంబు నీళ్లు తెచ్చారంటూ వైకాపా అధ్యక్షుడు జగన్ చేసిన విమర్శలు పాపులర్ అయ్యాయి.
వైకాపాలు యువ ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉన్నారు. ప్రజా సమస్యలను సరైన రీతిలో అసెంబ్లీలో ప్రస్తావించడంలో దూకుడు కనపడుతున్నా, పరిణితిలోపిస్తోందని, దీనివల్ల క్లైమాక్స్‌లో ఆ పార్టీ దెబ్బతింటోందనే విమర్శలు ఉన్నాయి. ఇటీవల విజయవాడలో కల్తీమద్యం, విశాఖ ఏజన్సీలో బాక్సైట్ తవ్వకాలపై జగన్ పర్యటనలకు మంచి స్పందన లభించింది. అనేక ప్రజా సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించాలనుకునే సమయంలో వైకాపా అధినేత జగన్‌లో దూకుడు వల్ల సంయమనం కొరవడిందని, దీని వల్ల ఆత్మరక్షణలో పడాల్సిన టిడిపి ఎదురుదాడికి దిగే అవకాశం కల్పించినట్లవుతోంది.
అసెంబ్లీకి బాగా ప్రిపేరై వచ్చే వైకాపా ఎమ్మెల్యేలు కొంత మంది తమ నేత తీరు పట్ల కలత చెందుతున్న సందర్భాలు ఉన్నాయి. వైకాపాలో ఫ్లోర్ స్ట్రాటేజి లోపించినట్లు కనపడుతోంది. ఈ లోపాన్ని జగన్ వచ్చే బడ్జెట్ సమావేశాల్లో సరిచేసుకుంటే బాగుంటుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.