S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

01/04/2016 - 13:39

తణుకు: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని తణుకులో భారీ బోగి పిడకల దండ తయారు చేశారు. 3.20 లక్షల పిడకలతో 3 కి.మీ పొడవైన ఈ దండ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం దక్కించుకుంది. అనుకుల ప్రసాద్ అనే వ్యక్తి 50 మంది కార్మికులతో మూడు నెలలపాటు శ్రమించి పిడకల దండను రూపొందించాడు.

01/03/2016 - 08:05

రాజమహేంద్రవరం, జనవరి 2: ఆచార్య ఎన్‌జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 47వ స్నాతకోత్సవాన్ని ఈనెల 4న రాజమహేంద్రవరంలో నిర్వహించేందుకు వ్యవసాయ విశ్వవిద్యాలయం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ వ్యవసాయ కళాశాల ఆధ్వర్యంలో శ్రీ వేంకటేశ్వర ఆనం కళాకేంద్రంలో స్నాతకోత్సవాన్ని నిర్వహించాలని విశ్వవిద్యాలయం అధికారులు నిర్ణయించారు.

01/03/2016 - 08:04

విజయనగరం, జనవరి 2: విజయనగరం జిల్లా కొండవెలగాడ గ్రామంలో వెయిట్ లిఫ్టింగ్ అకాడమీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. కనీస సౌకర్యాలు లేని గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన పలువురు రాష్ట్ర క్రీడాకారులు వివిధ అంశాలలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించటంపట్ల ఆయన హర్షం వ్యక్తం చేసారు.

01/03/2016 - 08:03

కర్నూలు, జనవరి 2: నవ్యాంధ్రప్రదేశ్‌ను భూవివాద రహిత రాష్ట్రంగా మార్చాలన్న ధృడ సంకల్పంతో మొట్టమొదటిసారిగా ఎలక్ట్రానిక్ టోల్‌స్టేషన్ (ఇటిఎస్) ఏర్పాటు చేశామని ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి చెప్పారు. శనివారం కర్నూలు మండలం బి.తాండ్రపాడు డిఆర్‌డిఎ శిక్షణ కేంద్రంలో 7 జిల్లాల నుండి వచ్చిన సర్వేయర్ల శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.

01/03/2016 - 08:02

జన్మభూమిని బహిష్కరించిన వైకాపా నేతలు

01/03/2016 - 08:01

అధికారుల నిలదీత..ఉత్తరాంధ్రలో ఉద్రిక్తతలు
తహశీల్దార్‌ను నిర్బంధించిన టిడిపి నాయకులు

01/02/2016 - 15:28

హైదరాబాద్: జన్మభూమి కార్యక్రమంలో టీడీపీ నేతలను నిలదీయాలని ఎమ్మేల్యే రోజా ప్రజలకు పిలుపునిచ్చారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రజాప్రతినిధులను కాదని సెక్స్ రాకెట్ నిందితులు, ఎన్నికల్లో ఓడిపోయిన టీడీపీ నేతలకు అభివృద్ధి నిధులు ఎలా కేటాయిస్తారని చంద్రబాబును ఆమె ప్రశ్నించారు

01/02/2016 - 13:45

చిత్తూరు : కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు జిల్లాలో పర్యటించారు. వరదయ్యపాలెం శ్రీసిటీఆల్‌స్ట్రామ్ కంపెనీలో రైల్‌కోచింగ్ విభాగాన్ని ప్రారంభించారు. అనంతరం అక్కడ నిర్వహించిన సభలో వెంకయ్య పాల్గొన్నారు.

01/02/2016 - 11:57

విశాఖ: యలమంచిలి పట్టణంలోని అల్లూరి సీతారామరాజు కాలనీ ప్రధాన రహదారిపై శనివారం ఉదయం తల లేని ఓ వ్యక్తి మొండెం కలకలం సృష్టించింది. స్థానికులు ఈ దృశ్యాన్ని చూసి భయాందోళనలకు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తిని ఎవరో హత్య చేసి తల భాగాన్ని పట్టుకుపోయి మొండేన్ని ఇక్కడ పడేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

01/02/2016 - 11:56

కర్నూలు: చాగలమర్రి వద్ద అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను శనివారం ఉదయం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని తరలిస్తున్న నిందితులను అరెస్టు చేసి లారీని సీజ్ చేశారు.

Pages