ఆంధ్రప్రదేశ్‌

భూ వివాదరహిత రాష్టమ్రే లక్ష్యం: కెఇ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, జనవరి 2: నవ్యాంధ్రప్రదేశ్‌ను భూవివాద రహిత రాష్ట్రంగా మార్చాలన్న ధృడ సంకల్పంతో మొట్టమొదటిసారిగా ఎలక్ట్రానిక్ టోల్‌స్టేషన్ (ఇటిఎస్) ఏర్పాటు చేశామని ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి చెప్పారు. శనివారం కర్నూలు మండలం బి.తాండ్రపాడు డిఆర్‌డిఎ శిక్షణ కేంద్రంలో 7 జిల్లాల నుండి వచ్చిన సర్వేయర్ల శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ రాష్ట్రంలో భూవివాదాలకు స్వప్తి చెప్పేందుకు ఇటిఎస్ మిషన్ల సాంకేతిక పరిజ్ఞానంతో భూతగాదాలు పురిష్కరించేందుకు శ్రీకారం చుట్టామన్నారు. మీ ఇంటికి-మీ భూమి రెండు విడతల్లో వచ్చిన భూ సమస్యను ఇటిఎస్ సిస్టమ్ ద్వారా దాదాపు 92 శాతం పరిష్కరించామన్నారు. భూమి కొలతల్లో సర్వేయర్ల పాత్ర కీలకమన్నారు. పూర్తి స్థాయిలో ఇటిఎస్ సిస్టమ్‌తో శిక్షణ పొంది భూ వివాద రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలన్నారు. 700 మంది సర్వేయర్లు, 300 మంది లైసెన్స్ సర్వేయర్ల ససకారంతో భూ సర్వే పనులు చేపట్టామన్నారు. 273 ఇడిఎస్ సిస్టమ్‌లు కొన్నామని, మరో 350 ఇటిఎస్ సిస్టమ్‌ల కోసం ఆర్డర్లు ఇచ్చామన్నారు. మిషన్ల ద్వారా దాదాపు 12 లక్షల ఆర్‌ఎస్ డేటాను పూర్తి చేశామన్నారు. అలాగే ప్రతి జిల్లాలో ఆటోకేడ్‌ను ప్రవేశ పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు.