ఆంధ్రప్రదేశ్‌

రేపు రాజమహేంద్రవరంలో ఆచార్య ఎన్‌జి రంగా వర్శిటీ స్నాతకోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జనవరి 2: ఆచార్య ఎన్‌జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 47వ స్నాతకోత్సవాన్ని ఈనెల 4న రాజమహేంద్రవరంలో నిర్వహించేందుకు వ్యవసాయ విశ్వవిద్యాలయం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ వ్యవసాయ కళాశాల ఆధ్వర్యంలో శ్రీ వేంకటేశ్వర ఆనం కళాకేంద్రంలో స్నాతకోత్సవాన్ని నిర్వహించాలని విశ్వవిద్యాలయం అధికారులు నిర్ణయించారు. ఇది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంయుక్తంగా నిర్వహిస్తున్న చివరి స్నాతకోత్సవం. రాష్ట్ర విభజన అనంతరం అత్యంత ప్రతిష్ఠాత్మంగా చేపడుతున్న ఈ స్నాతకోత్సవానికి వ్యవసాయ విశ్వవిద్యాలయం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. స్నాతకోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు స్థారుూ సంఘాలను నియమించామని వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ కందుకూరి సీతారామయ్య తెలిపారు. స్నాతకోత్సవ కార్యక్రమాలను వీక్షించేందుకు కళాకేంద్రం లోపల, బయట ఎల్‌ఇడి స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. వ్యవసాయ వర్శిటీ రిజిస్ట్రార్ డాక్టర్ టివి సత్యనారాయణ మాట్లాడుతూ స్నాతకోత్సవంలో ఎమ్మెస్సీ, ఎంటెక్, గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన సుమారు 577మందికి పట్టాలు పంపిణీచేస్తామని, 25మంది ఉత్తమ ఆచార్యులకు, పరిశోధన, విస్తరణ శాస్తవ్రేత్తలకు అవార్డులను అందిస్తామన్నారు. స్నాతకోత్సవంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు 30మందికి వ్యవసాయంలో పిహెచ్‌డి పట్టాలు, ఐదుగురికి గృహవిజ్ఞానంలో పిహెచ్‌డిలు పంపిణీ చేస్తారు. వ్యవసాయంలో ఎమ్మెస్సీ పట్టాలు 109మందికి, బయోటెక్నాలజీలో ఎమ్మెస్సీ పట్టాలు నలుగురికి, ఎంవిబిఎంలో 13మందికి, గృహవిజ్ఞానంలో ఎమ్మెస్సీ పట్టాలు 10మందికి, ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎమ్మెస్సీ పట్టాలు ఏడుగురికి అందించనున్నారు. అండర్ గ్రాడ్యుయేషన్‌లో 395మందికి పట్టాలు పంపిణీచేస్తారు. స్నాతకోత్సవంలో కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వశాఖ కార్యదర్శి సిరాజ్ హుస్సేన్ స్నాతకోపన్యాసం చేయనున్నారు. ఈ సందర్భంగా ఆయనకు గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేయనున్నట్టు ఆచార్య ఎన్‌జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ టివి సత్యనారాయణ తెలిపారు. వ్యవసాయంలో నలుగురు ఉత్తమ అధ్యాపకులకు, వ్యవసాయ ఇంజనీరింగ్‌లో ఇద్దరికి, వ్యవసాయంలో ఐదుగురు ఉత్తమ శాస్తవ్రేత్తలకు, వ్యవసాయ ఇంజనీరింగ్‌లో ఉత్తమ శాస్తవ్రేత్త ఒకరికి, విస్తరణ విభాగంలో ఇద్దరికి అవార్డులు అందిస్తామన్నారు. ఏడుగురు పిజి, 19మంది యుజి విద్యార్థులకు బంగారు పతకాలను అందిస్తామన్నారు. రైతులు, చక్కెర మిల్లులు ఏర్పాటుచేసిన 11 అవార్డులను, ఆచార్య ఎన్‌జి రంగా యువశాస్తవ్రేత్త అవార్డును మారుటేరు వ్యవసాయ పరిశోధనాసంస్థలో శాస్తవ్రేత్తగా పనిచేస్తున్న డాక్టర్ పి వెంకట రమణారావుకు అందించనున్నట్టు రిజిస్ట్రార్ టివి సత్యనారాయణ తెలిపారు.