ఆంధ్రప్రదేశ్‌

కొండవెలగాడలో వెయిట్ లిఫ్టింగ్ అకాడమీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, జనవరి 2: విజయనగరం జిల్లా కొండవెలగాడ గ్రామంలో వెయిట్ లిఫ్టింగ్ అకాడమీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. కనీస సౌకర్యాలు లేని గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన పలువురు రాష్ట్ర క్రీడాకారులు వివిధ అంశాలలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించటంపట్ల ఆయన హర్షం వ్యక్తం చేసారు. నెల్లిమర్ల మండలం కొండవెలగాడలో వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారుల కోసం ఆధునిక సదుపాయాలతో నిర్మించిన క్రీడా భవనాన్ని ఆయన శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడుతు రాష్ట్రంలో క్రీడాకారులను అన్ని విధాలా ప్రోత్సహిస్తామని అన్నారు. క్రికెట్ ఆడితేనే డబ్బులు వస్తాయని అనుకోవటం మంచిది కాదని, ప్రస్తుత పరిస్థితుల్లో వివిధ క్రీడల్లో పాల్గొనే క్రీడాకారులకు డబ్బులతోపాటు అవార్డులు, ప్రభుత్వ ఉద్యోగాలు వస్తున్నాయని తెలిపారు. రాజధాని అమరావతిని ఒలంపిక్ క్రీడలు నిర్వహించే స్థాయిలో తీర్చిదిద్దుతామన్నారు. అంతర్జాతీయ, జాతీయ స్థాయి పోటీల్లో వెయిట్‌లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొని పతకాలు సాధించిన క్రీడాకారులు మత్స సంతోషి, ఉష, వెంకటలక్ష్మి, రామకృష్ట, శ్రీనివాసరావులను ఆయన అభినందించారు. కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ వౌలిక సదుపాయాలను వినియోగించుకుని నాణ్యమైన శిక్షణతో దేశానికి మంచిపేరు తేవాలని సూచించారు.