S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

01/09/2016 - 15:52

తిరుమల : తిరుమల శేషాచల కొండల్లో శనివారం అగ్నిప్రమాదం సంభవించింది. వేణుగోపాల స్వామి గుడి సమీపానికి మంటలు వ్యాపించాయి. ఫైరింజన్లతో ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.

01/09/2016 - 15:46

విజయవాడ: రాజకీయ కక్షతోనే విష్ణుపై అక్రమ కేసులు పెడుతున్నారని పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ఆరోపించారు. శనివారం విజయవాడ సబ్‌జైలులో విష్ణును ఆయన పరామర్శించారు. పార్టీ తరపున ఆయనకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. స్వర్ణ బార్‌లో జరిగిన మరణాలకు కల్తీ మద్యం కారణం కాదని రఘువీరా అన్నారు. విష ప్రయోగం వల్లే మరణాలు జరిగాయని చెప్పారు.

01/09/2016 - 15:33

కడప :రాయలసీమలోని పెండింగ్‌ ప్రాజెక్ట్‌లను పూర్తి చేస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. శనివారం అలంఖాన్‌పల్లెలో నిర్వహించిన జన్మభూమి-మాఊరులో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రాయలసీమకు నీళ్లు ఇవ్వగలిగితే అభివృద్ధి సాధ్యమని సీఎం తెలిపారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి కృషి చేస్తున్నానని చెప్పారు.

01/09/2016 - 13:18

విజయవాడ ‌:విజయవాడలో ఆహార నియంత్రణ శాఖ అధికారులు వరుసగా రెండో రోజు కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. నగరంలోని 20 ప్రాంతాల్లో వంటనూనె తయారీ, సుగంధద్రవ్యాలు, పప్పుమిల్లుల్లో ఆహార నియంత్రణ శాఖ అధికారులు ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు.

01/09/2016 - 12:02

విశాఖ: ఒడిశా నుంచి ఆంధ్రా ప్రాంతం మీదుగా అక్రమంగా తరలిస్తున్న సుమారు 60 కిలోల గంజాయిని పోలీసులు శనివారం తెల్లవారుజామున స్వాధీనం చేసుకున్నారు. చిలకలగడ్డ ఫారెస్ట్ చెక్‌పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించి నలుగురిని అరెస్టు చేశారు. గంజాయిని తరలిస్తున్న వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు.

01/09/2016 - 12:01

విజయవాడ: సంక్రాంతి సందర్భంగా పేద వర్గాలకు ఇస్తున్న నిత్యావసర సరకులను సక్రమంగా అందజేయాలని, ఈ విషయంలో ఎలాంటి అవకతవకలు జరిగినా కఠిన చర్యలు తప్పవని ఎ.పి. సి.ఎం చంద్రబాబు అధికారులను హెచ్చరించారు. ఆయన శనివారం ఉదయం వివిధ జిల్లాల అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి, చంద్రన్న కానుకల పంపిణీ స్ర్తిలను సమీక్షించారు.

01/09/2016 - 12:00

గుంటూరు: నరసరావుపేట మండలం లక్ష్మీపురం వద్ద శనివారం ఉదయం ఆర్టీసీ బస్సు చెట్టుకు ఢీకొని బోల్తాపడగా పది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ బస్సు విజయవాడ నుంచి గుంటూరు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

01/09/2016 - 12:00

విశాఖ: ఎ.పి. తెలంగాణాల్లో రాత్రిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కంటె 2 నుంచి 4 డిగ్రీల వరకు తక్కువగా నమోదవుతున్నాయి. తెలంగాణలోని ఆదిలాబాద్, ఎ.పిలో విశాఖ ఏజెన్సీ, నందిగామ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గాయి. రాబోయే రెండు మూడు రోజుల్లో రాత్రిపూట చలి మరింతగా పెరిగే అవకాశం ఉంది.

01/09/2016 - 11:59

అనంతపురం: కళ్యాణదుర్గం మండలం మల్లికార్జునపల్లి వద్ద శనివారం ఉదయం లారీ ఢీకొనడంతో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఎర్రమ్మ, మల్లికార్జున అనే దంపతులు అక్కడికక్కడే మరణించారు.

01/09/2016 - 11:59

నెల్లూరు: సూళ్లూరుపేటలో రెండు రోజులపాటు జరిగే ఫ్లెమింగో ఫెస్టివల్ శనివారం ప్రారంభమైంది. నేలపట్టు, పులికాట్ సరస్సు ప్రాంతాలు జనవరిలో ఫ్లెమింగో పక్షుల సందడితో పర్యాటకులను అలరిస్తాయి. ఫ్లెమింగో ఫెస్టివల్‌లో పాల్గొనేందుకు తెలుగు రాష్ట్రాలతోపాటు తమిళనాడు, కర్ణాటకల నించి కూడా పర్యాటకులు వస్తున్నారు. రాష్టమ్రంత్రులు నారాయణ, సిద్దా రాఘవరావు ఈ ఫెస్టివల్‌ను ప్రారంభించారు.

Pages